Indian Railways: వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా..? లేదా..? ఇకపై 100 శాతం ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు..
ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొస్తుంది. పాత కాలం నాటి సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సాంకేతికతను జొడించనుంది. దీని వల్ల వెయింటింగ్ లిస్ట్ టికెట్ల ప్రయాణికులకు ఖచ్చితమైన సమాచారం లభించనుంది.

రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారా..? మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో పడిపోయిందా..? ఛార్ట్ ప్రిపేర్ అయ్యే టైమ్‌కు మీ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా? లేదా? అనే ఆందోళన పడుతున్నారా..? అయితే త్వరలో మీ టెన్షన్ తీరనుంది. ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టింది. దీని ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్, వేగవంతంగా రిజర్వేషన్ సేవలు పొందవచ్చు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌కు సంబంధించి 94 శాతం ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు.
ముందుగానే తెలుసుకునే అవకాశం
ఇండియన్ రైల్వే పాతకాలం నాటి రిజర్వేషన్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తోంది. 1986 నాటి రిజర్వేషన్ సిస్టమ్ స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి దీనిని దశలవారీగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త సిస్టమ్ అత్యంత వేగవంతంగా ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునేప్పుడు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉండవు. వేగవంతంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త సిస్టమ్ అభివృద్ది చేస్తున్నారు. ఇందులో ఏఐ సాంకేతికను జోడిస్తున్నారు. దీంతో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫార్మ్ అవుతాయా లేదా అనేది ముందుగా తెలుసుకోవచ్చు. గతంలో కేవలం కొన్ని వెబ్ సైట్లు, పాత హిస్టరీ, ఊహాగానాల ఆధారంగా అంచనా వేసేవారు. ఇందులో కేవలం 53 శాతం మాత్రమే ఖచ్చితత్వం ఉండేది.
తొలగిపోనున్న సమస్య
కానీ ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టబోయే ఏఐ టెక్నాలజీ వల్ల 94 శాతం ఖచ్చితత్వంతో వెయిటింగ్ టికెట్ల కన్పర్మేషన్ గురించి తెలుసుకోవచ్చు. గత బుకింగ్ డేటా, రూట్ డిమాండ్, గత టికెట్ల రద్దులు అంచనాల ఆధారంగా ఏఐ సమాచారం ఇస్తుంది. ప్రస్తుతం దాదాపు 88 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. దీంతో ఏఐను అనుసంధానించడం వల్ల ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని ప్రయాణానికి ప్రత్యాయ్నాయ ప్లాన్ రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం చివరి నిమిషంలో టికెట్లు కన్పార్మ్ కాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్య తొలగిపోనుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. దశలవారీగా అందులో సిస్టమ్ అప్ గ్రేడ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాదిలో బుల్లెట్ ట్రైన్ కూడా ప్రారంభించేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ స్లోగా ఉంది. ఎక్కువమంది ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే నెమ్మదించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి సమస్యలు రాకుండా కొత్త సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
