Indian Railways: రైలు ప్రయాణంలో మీ లగేజీ పోతే రైల్వే బాధ్యత వహిస్తుందా? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

|

Jun 17, 2023 | 8:33 PM

భారతీయ రైల్వే దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే..

Indian Railways: రైలు ప్రయాణంలో మీ లగేజీ పోతే రైల్వే బాధ్యత వహిస్తుందా? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!
Indian Railways
Follow us on

భారతీయ రైల్వే దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ట్రైన్‌లో ప్రయాణించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ప్రకనను చాలా సార్లు విని ఉంటారు. అదేంటంటే.. ‘ప్రయాణికులారా దయచేసి గమనించండి.. ప్రయాణికులు తమ లగేజీని జాగ్రత్తగా ఉంచుకోవాలి’ అని. ఈ ప్రకటనపై కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైలు ప్రయాణంలో ప్రయాణికుల లగేజీ ఏదైనా పోయినట్లయితే దానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. రైల్వే లోపం వల్ల ఇలా జరిగిందని పరిగణించలేమని, అందుకు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. రైలులో ఓ వ్యాపారి తన నడుముకు ఉన్న బెల్ట్‌లో ఉంచిన లక్ష రూపాయలు పోయినట్లు, తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన రైల్వేను ఆశ్రయించాడు. అనంతరం ఆ వ్యాపారి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఈ వ్యాపారికి లక్ష రూపాయలు చెల్లించాలని జాతీయ వినియోగదారుల కమిషన్‌ రైల్వేను ఆదేశించింది. దీనిపై జిస్టస్‌ విక్రమ్‌, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఆ ఆదేశాలను తిరస్కరించింది. రైలు ప్రయాణంలో ప్రయాణికులు ఎవరైనా తమ వస్తువులను పోగొట్టుకున్నట్లయితే రైల్వే ఎలాంటి బాధ్యత వహించదని, ప్రయాణికులే రక్షించుకోవాలని తెలిపింది. ఎవరైన ప్రయాణికులు ట్రైన్‌లో తమ వస్తువులను పోగొట్టుకున్నట్లయితే వారే బాధ్యత వహించుకోవాలని, అందుకు రైల్వే శాఖ ఎలాంటి పరిహారం అందించబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి