Indian Railways: భారతీయ రైల్వే మెగా ప్లాన్.. వారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే..

దేశవ్యాప్తంగా వలస కార్మికులు, కార్మిక వర్గ సమూహాల అవసరాలను తీర్చడానికి రైల్వే బోర్డు నాన్-ఎసి, జనరల్ కేటగిరీ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన..

Indian Railways: భారతీయ రైల్వే మెగా ప్లాన్.. వారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే..
Indian Railways

Updated on: Jul 21, 2023 | 4:00 AM

దేశవ్యాప్తంగా వలస కార్మికులు, కార్మిక వర్గ సమూహాల అవసరాలను తీర్చడానికి రైల్వే బోర్డు నాన్-ఎసి, జనరల్ కేటగిరీ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన రాష్ట్రాలను గుర్తించిన అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు, ఇటువంటి ప్రత్యేక రైళ్లను పండుగలు లేదా పీక్ సీజన్లలో మాత్రమే ప్రారంభించేవారు. ప్యాసింజర్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాట్లను శాశ్వతంగా చేయాలని ప్రతిపాదించారు.

జనవరి 2024 నుంచి నడుస్తున్న కొత్త రైళ్లలో నాన్ AC LHB కోచ్‌లు ఉంటాయి. అలాగే స్లీపర్, జనరల్ కేటగిరీ సర్వీస్ మాత్రమే ఉంటాయి. ఈ రైళ్లకు రైల్వే ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు. ఇంతకుముందు కరోనావైరస్ సంక్షోభం సమయంలో రైల్వేలు కార్మికులను వారి స్వస్థలాలకు తిరిగి రావడానికి వలస ప్రత్యేక రైళ్లను నడిపాయి.

రైల్వే బోర్డు ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది నైపుణ్యం-నైపుణ్యం లేని కార్మికులు, చేతివృత్తులవారు, కార్మికులు, ఇతరులు ఈ రాష్ట్రాల నుంచి పని కోసం మెట్రోలు, పెద్ద నగరాలకు వెళతారు. ఈ వ్యక్తుల కోసం రైళ్లు నడపనున్నారు. ఇందులో స్లీపర్-జనరల్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉపయోగించబడతాయి. వలస ప్రత్యేక రైళ్లలో కనీసం 22 నుంచి గరిష్టంగా 26 కోచ్‌లు ఉంటాయని ఒక అధికారి తెలిపారు. కాలానుగుణంగా కాకుండా అవి ఏడాది పొడవునా శాశ్వతంగా అమలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా రెగ్యులర్ టైమ్ టేబుల్‌లో చేర్చనున్నారు. తద్వారా ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చేందుకు ఎల్‌హెచ్‌బి కోచ్‌లు, వందే భారత్ కోచ్‌లు అనే రెండు రకాల కోచ్‌లు మాత్రమే సేవలో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 28 రకాల కోచ్‌లు సేవలు అందిస్తున్నాయి. దీంతో మరమ్మతు ఖర్చు తగ్గుతుందని, ప్రయాణం కూడా చౌకగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి