Indian Railways: రైలు ఎక్కే ముందు ఈ ఒక్క యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. చాలు..
తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ఇక రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అయితే మనలో కొందరు ఈ సమస్యలను చూసి చూడనట్లు వదిలేస్తాం. మరికొందరు మాత్రం ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. అయితే మరికొందరు మాత్రం ఫిర్యాదు...

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియన్ రైల్వే 4వ స్థానంలో ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రతీ రోజూ ఏకంగా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను ఒకచోటు నుంచి మరో చోటుకి ప్రయాణికులను, వస్తువులను ఇండియన్ రైల్వే చేరవేస్తుంది. వేలాది మందికి ఉపాధి సైతం కల్పిస్తున్నారు.
తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ఇక రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అయితే మనలో కొందరు ఈ సమస్యలను చూసి చూడనట్లు వదిలేస్తాం. మరికొందరు మాత్రం ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. అయితే మరికొందరు మాత్రం ఫిర్యాదు చేయాలని ఉన్నా ఎలా చేయలో తెలియక వదిలేస్తుంటారు.
అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇండియన్ రైల్వే ఓ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా.? నిజానికి ఈ యాప్ ఎప్పుడో అందుబాటులో ఉన్నా మనలో చాలా మంది తెలియదు. రైలు ఎక్కే ముందు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు ప్రయాణ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా, రైల్వే సేవల్లో ఏవైనా లోపం ఉన్నా వెంటనే మొబైల్ యాప్‌తోనే ఫిర్యాదు చేయొచ్చు. ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్ మదద్ పేరుతో ఈ యాప్‌ను ఇండియన్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రైల్వే ప్రయాణంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అధికారులు మీ ఫిర్యాదును స్వీకరించి, కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారానికి మార్గం చూపుతారు. ఇకపై ఎప్పుడు రైల్వే ప్రయాణం చేయాలనుకున్న వెంటనే ఈ యాప్‌ను డౌల్‌లోడ్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
