
Railway Station Rooms: భారత రైల్వే. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అయితే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరు రైలు ప్రయాణంపై ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలే కాకుండా చిన్న ప్రయాణాలకూ ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరుస్తుంటుంది. కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంది. రైల్వే అందిస్తున్న సదుపాయాలలో ముఖ్యంగా స్టేషన్లలో అందించే రిటైరింగ్ రూమ్స్ సదుపాయం.
రైలు ప్రయాణానికి సమయం ఉన్నందున విశ్రాంతి తీసుకునేందుకు ఈ రూమ్స్ ఉపయోగపడతాయి. రైలు ఆలస్యం కావడం, కనెక్టింగ్ ట్రైన్ కోసం గంటల కొద్దీ ఎదురుచూడాల్సి రావడం, లేదా రాత్రివేళ స్టేషన్‌కు చేరుకోవడం వంటి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండేందుకు ఈ రూల్స్ ఉపయోగపడుతుంటాయి.
స్టేషన్లలో విశ్రాంతి తీసుకోవాలంటే రూముల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బయట హోటల్ దొరకడం కష్టం. ముఖ్యంగా ఏసీ లేదా సౌకర్యవంతమైన గది కావాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్‌లోనే చాలా తక్కువ ఖర్చుకే మంచి సౌకర్యాలతో కూడిన రిటైరింగ్ రూమ్స్ లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100లకే రిటైరింగ్ గదులు అందుబాటులో ఉంటున్నాయి. రిటైరింగ్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్లలోనే ఉండే విశ్రాంతి గదులు. ఇవి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో మంచి గది, బెడ్, బాత్‌రూమ్ వంటి సౌకర్యాలు వస్తున్నాయి. కొన్ని పెద్ద స్టేషన్లలో ఏసీ గదులు కూడా లభిస్తున్నాయి.
మీరు రైల్వే స్టేషన్‌లలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే సులభమే. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ టికెట్ వివరాలతో లాగిన్ కావాలి. అక్కడ “రిటైరింగ్ రూమ్స్” అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, కావాల్సిన స్టేషన్, చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలను ఎంచుకోవాలి. అప్పుడు ఏ గదులు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన గదిని ఎంపిక చేసి ఆన్‌లైన్‌లోనే చెల్లింపు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి