రైలు ప్రయాణాల్లో లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లోయర్ బెర్తుల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. దివ్యాంగులతోపాటు వారి కుటుంబీకులకు అమలయ్యే విధాన పరమైన నిర్ణయాన్ని కూడా ఇండియన్ రైల్వే వెల్లడించింది. గతంలో దివ్యాంగుల ప్రయోజనం కోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను సంప్రదించకుండానే ఐర్సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించించి. ఇప్పుడు వీరికి సంబంధించి మరో కీలక నిర్ణయం ప్రకటించింది. రైలు ప్రయాణ సమయంలో దివ్యాంగుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ప్రతి బోగిలో లోయర్ బెర్తులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వారితో ప్రయాణించే కుటుంబీకులకు కూడా లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయించనుంది.
స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్), థర్డ్ ఏసీలో రెండు బెర్త్‌లు (ఒక లోయర్, ఒక మిడిల్), థర్డ్ క్లాస్‌లో రెండు (ఒక లోయర్, ఒక మిడిల్) బెర్త్‌లు దివ్యాంగులకు రిజర్వ్ చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. గరీబ్‌రథ్‌లో రెండు లోయర్, రెండు అప్పర్ బెర్తులు దివ్యాంగులకు కేటాయించారు. చైర్‌కార్ రైళ్లలో కూడా రెండు సీట్లు వికలాంగులకు కేటాయించనున్నారు. కాగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించే వృద్ధులు, మహిళలకు ఈ సౌకర్యాన్ని ఇప్పటికే రైల్వే శాఖ కల్పించింది. మరోవైపు సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే టికెట్ల రాయితీ అంశంలో రైల్వే శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.