
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారత రైల్వేస్ (Indian Railways) ఒకటి. ఇది భారతదేశంలో ప్రయాణికులు, సరుకుల రవాణాకు ప్రధాన ఆధారంగా ఉంది. రోజూ కోట్లాది మంది ప్రయాణికులు భారత రైల్వేస్ సేవలను వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు రైలు ప్రయాణంలో ప్రయాణీకులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రైలు ఆలస్యం కావడం, ఏసీ పనిచేయకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో టికెట్ డబ్బులను రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. TDR (Ticket Deposit Receipt) విధానం ద్వారా టికెట్ డబ్బులు రీఫండ్ పొందే అవకాశముంది. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో ఈ రీఫండ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. మీరు చూపిన కారణం సహేతుకమైతే.. టీడీఆర్ ద్వారా పూర్తి టికెట్ డబ్బులు లేదా పాక్షికంగా టికెట్ డబ్బులు రీఫండ్ పొందేందుకు వీలుంటుంది.
1. రైలు ఆలస్యం: మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నప్పుడు.. ఆ రైలులో మీరు ప్రయాణించకూడదని నిర్ణయిస్తే టీడీఆర్ ద్వారా టికెట్ రీఫండ్‌కు అప్లై చేసుకోవచ్చు. అయితే రైలు బయలుదేరే సమయానికి ముందే TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
2. ఏసీ పనిచేయకపోవడం: మీరు AC కోచ్‌లో టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణంలో ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా ఏసీ పనిచేయకపోతే మీరు టీడీఆర్ ద్వారా టికెట్ రీఫండ్ కోరచ్చు. మీరు గమ్యస్థానానికి చేరిన 20 గంటల్లోపు TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
3. దిగువ తరగతిలో ప్రయాణం: బుక్ చేసిన కోచ్ కాకుండా తక్కువ తరగతి బోగీలో ప్రయాణించాల్సి వస్తే టికెట్ రీఫండ్ కోసం 2 రోజుల్లోపు TDR ఫైల్ చేయాలి.
4. రైలు రూట్ మార్పు: ఏదైనా కారణాలతో రైలు రూట్ మారడంతో.. అది మీ స్టేషన్‌కి రాకపోయినా లేదా మీరు రైలు అందుకోలేకపోయినా 72 గంటల్లోపు TDR ఫైల్ చేయాలి.
పైన పేర్కొన్న కారణాలతో రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాలకు సహేతుక కారణాలుంటే సరైన సమయంలో TDR ఫైల్ చేస్తే టికెట్ డబ్బులు రీఫండ్ పొందడం సాధ్యమే.
TDR ఫైల్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
రైల్వే శాఖ సమగ్ర పరిశీలన తర్వాతే టీడీఆర్ రీఫండ్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది. టీడీఆర్ ఫైల్ చేయడానికి టైమ్‌లిమిట్ చాలా కీలకం. టీడీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం అయితే రీఫండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. టీడీఆర్ ఫైలింగ్ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి)