Diwali 2024: దీపావళికి తియ్యటి వార్త చెప్పిన ఇండియన్ పోస్ట్స్.. ఆ దేశాలకు తక్కువ ధరలో స్వీట్స్ డెలివరీ

|

Oct 26, 2024 | 5:18 PM

భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా పండుగలు అంటే మొదటగా గుర్తు వచ్చేది స్వీట్లు. అయితే విదేశాల్లో ఉన్న వారు ఈ స్వీట్ల రుచిని ఆశ్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భారీ డెలివరీ చార్జీల నేపథ్యంలో వారు జిహ్వ చాపల్యాన్ని చంపుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి ఇండియన్ పోస్ట్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Diwali 2024: దీపావళికి తియ్యటి వార్త చెప్పిన ఇండియన్ పోస్ట్స్..  ఆ దేశాలకు తక్కువ ధరలో స్వీట్స్ డెలివరీ
చక్కెర ఎక్కువగా తినడం వల్ల మరింత ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతే త్వరగా పడిపోతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. చక్కెర మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ మీ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు, అలసిపోయినట్లుగా మారి నీరసంగా అనిపిప్తుంది.
Follow us on

ప్రస్తుతం దేశంలో దీపావళి హడావుడి నెలకొంది. భారతీయ సంస్కృతిలో పండుగ సీజన్లో ఆహారం స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబం, స్నేహితులతో పంచుకోవడానికి ప్రతి ఇంటిలో రుచికరమైన స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తయారు చేసే స్వీట్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే భారతదేశానికి దూరంగా విదేశాల్లో నివసిస్తున్న వారికి ఇండియన్ పోస్ట్స్ మంచి వార్త చెప్పింది.  సరికొత్త సేవలతో ఎప్పుడూ ప్రజాదరణ పొందే ఇండియన్స్ పోసట్స్ ఇంట్లో తయారు చేసిన దీపావళి స్వీట్లను 126 దేశాలకు సరసమైన ధరలకు పంపుతామని స్పష్టం చేసింది.

ఇంటి రుచులను కోరుకునే వారికి తాజాగా, సురక్షితంగా డెలివరీ సర్వీసులు అందిస్తామని స్పష్టం చేసింది. కేజీ నుంచి 35 కేజీల వరకు స్వీట్లను రవాణా చేసే అవకాశాన్ని ఇండియన్ పోస్ట్స్ అందిస్తుంది. ప్రైవేట్ కొరియర్లతో చాలా తక్కువ ధరల్లోనే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ 10-15 బుకింగ్లు జరుగుతున్నాయని భవిష్యత్‌లో మరిన్ని బుకింగ్స్ వస్తాయని ఇండియన్ పోస్ట్స్ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

డెలివరీ చార్జీలు ఇలా

  • యూఎస్ఏకు 1 కిలోకు రూ.1,746 (ఎయిర్ పార్శిల్), రెండు కిలోలకు రూ.2,678 (స్పీడ్ పోస్ట్), 3 కిలోలకు రూ.3,398 (ఎయిర్ పార్శిల్), నాలుగు కిలోలకు రూ.4,094 (స్పీడ్ పోస్ట్)
  • యూకేకు 1 కిలోకు రూ.2,177 (ఎయిర్ పార్శిల్),  రెండు కేజీలకు రూ.2,637 (స్పీడ్ పోస్ట్), 3 కిలోలకు రూ.3,357 (ఎయిర్ పార్శిల్) 
  • యూఏఈకు 1 కిలోకు రూ.955 (ఎయిర్ పార్శిల్), రెండు కిలోలకు రూ.1,793 (స్పీడ్ పోస్ట్), 3 కిలోలకు రూ.1,427 (ఎయిర్ పార్శిల్)
  • కెనడాకు పార్శిల్ చేస్తే 1 కిలోకు రూ.1,911 (ఎయిర్ పార్శిల్), రెండు కిలోలకు రూ.2,029 (స్పీడ్ పోస్ట్); 3 కిలోలకు రూ.3,469 (ఎయిర్ పార్శిల్)
  • జర్మనీకి కిలోకు రూ.2,094 (ఎయిర్ పార్శిల్), రెండు కిలోలకు రూ.2,078 (స్పీడ్ పోస్ట్), మూడు కిలోలకు రూ.2,896 (ఎయిర్ పార్శిల్)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి