భారతీయ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజర్ WazirX అతిపెద్ద భద్రతా ఉల్లంఘనకు గురైంది. ఫలితంగా ఏకంగా 230 మిలియన్ డాలర్లను నష్టపోయింది. జులై 18న వాజిర్ ఎక్స్ దాని మల్టీసిగ్ వాలెట్‌లలో ఒకదాని నుంచి భద్రతా ఉల్లంఘన జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. మిగిలిన ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి అన్ని ఉపసంహరణలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఇండియా కా బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్’ పేరిట ఉన్న వజీర్ ఎక్స్ వాలెట్‌లో ఈ సంఘటన జరిగింది. WazirX ‘ప్రిలిమినరీ రిపోర్ట్’ ప్రకారం.. నష్టం వాటిల్లిన వాలెట్ ఫిబ్రవరి 2023 నుంచి లిమినల్ రూపొందించిన డిజిటల్ అసెట్ కస్టడీ, వాలెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగిస్తోంది. ఈ వాలెట్‌కు ఆరుగురు వ్యక్తుల సంతకాలు నుంచి, ఐదు వజీర్‌ఎక్స్ నుంచి ఒకరు ఆమోదాలు అవసరం. దీనికి లావాదేవీలు జరపడానిక కనీసం ముగ్గురు WazirX సంతకందారులు, లిమినల్ సంతకందార ఆమోదం తెలపవల్సి ఉంటుంది. ఇలా ఆమోదించబడిన ఖాతాలకు మాత్రమే లావాదేవీలను అనుమతించే సెక్యురిటీ సిస్టం ఉంది.
అయితే హ్యాకర్లు లిమినల్ ఇంటర్‌ఫేస్‌లో ఉన్నవాటికి, లావాదేవీలో వాస్తవంగా జరుగుతున్న వాటికి మధ్య ఉన్న అంతరాన్ని ఉపయోగించుకుని, ఇంత పెద్ద మొత్తంలో దోచుకున్నారు. ఇలా వారు సెక్యురిటీ సిస్టంను తమ ఆధీనంలోకి తెచ్చుకుని వాలెట్‌పై నియంత్రణ సాధించి, లావాదేవీని జరిపారు. దీనిపై WazirX స్పందిస్తూ.. ‘మా మల్టీసిగ్ వాలెట్‌లలో ఒకటి భద్రతా ఉల్లంఘనకు గురైంది. మా టీం ఇందుకు గల కారణాలను అన్వేషిస్తుంది. మీ ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి, INR, క్రిప్టో ఉపసంహరణలు తాత్కాలికంగా నిలిపివేశాం. బలమైన భద్రతా వ్యవస్థలను కలిగి ఉన్నప్పటికీ, హ్యాకర్లు దీనిని తమ కంట్రోల్‌కి తెచ్చుకున్నారు. ఎక్స్ఛేంజీలు ప్రస్తుతం ఇతర డిపాజిట్లను బ్లాక్ చేసేందకు ప్రయత్నిస్తున్నాయి. హ్యాకర్లు కాజేసిన మొత్తం సొమ్మును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నమని’ తెలిపింది. అయితే లిమినల్ మాత్రం హ్యాకర్లు తమ సెక్యురిటీ సిస్టంను హ్యాక్ చేసినట్లు అంగీకరించలేదు. తమ సిస్టంను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.
📢 Update: We’re aware that one of our multisig wallets has experienced a security breach. Our team is actively investigating the incident. To ensure the safety of your assets, INR and crypto withdrawals will be temporarily paused. Thank you for your patience and understanding.…
— WazirX: India Ka Bitcoin Exchange (@WazirXIndia) July 18, 2024
రాజీపడిన వాలెట్ తమ సిస్టమ్ వెలుపల సృష్టించబడిందని, తమ ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని వాలెట్‌లు సురక్షితంగా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా WazirX ప్రధానంగా ఇండియన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న FIU రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజీలలో ఒకటి. ఇది ఇండియన్ పౌరులకు క్రిప్టో ఎక్స్ఛేంజ్ సేవలను అందిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న హై-ప్రొఫైల్ హ్యాక్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు మరింత పటిష్టమైన భద్రత అవసరం ఎంతైనా ఉందనే విషయం తేటతెల్లమైంది. కాగా భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ పరిశ్రమను పరిశీలిస్తున్న సమయంలో, కఠినమైన నిబంధనలను పరిశీలిస్తున్న సమయంలో ఈ హ్యాకింగ్ జరగడం గమనార్హం.