Festival Season: ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లు వాటినే ఎక్కువ కొంటారట..! తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

|

Sep 24, 2023 | 10:40 AM

పండగ సీజన్ మొదలైపోయింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ వ్యాపారాల జోరు పెరుగుతోంది. ఫెస్టివల్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, న్యూ ప్రాడక్ట్స్, సరికొత్త ఫీచర్లతో న్యూ గ్యాడ్జెట్స్..ఇలా వీటి ప్రచారాల హోరు క్రమేపీ ఎక్కువవుతోంది.  పండుగ సీజన్ లో కస్టమర్లు ఎటువంటి వస్తువులు కొంటారు? అనే అంశంపై పలు సంస్థలు రీసెర్చ్ చేశాయి.

Festival Season: ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లు వాటినే ఎక్కువ కొంటారట..! తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
Festive Season Offers
Follow us on

దేశంలో పండగ సీజన్ మొదలైపోయింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ వ్యాపారాల జోరు పెరుగుతోంది.  ఫెస్టివల్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, న్యూ ప్రాడక్ట్స్, సరికొత్త ఫీచర్లతో న్యూ గ్యాడ్జెట్స్..ఇలా వీటి ప్రచారాల హోరు క్రమేపీ ఎక్కువవుతోంది.  పండుగ సీజన్ లో కస్టమర్లు ఎటువంటి వస్తువులు కొంటారు? అనే అంశంపై పలు సంస్థలు రీసెర్చ్ చేశాయి. అలా రీసెర్చ్‌ నివేదికలను పరిగణలోకి తీసుకుని.. కస్టమర్ల చూపు ఎటువైపు ఎక్కువ ఉండవచ్చో ఒక అంచనా వేసుకుని కంపెనీలు తమ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ సంవత్సరం పండగ సీజన్ కి ఎటువంటి ప్రొడక్ట్స్ కొనాలని మన జనం ఉత్సాహ పడుతున్నారో లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్స్ బయట పెట్టాయి. అవేమిటో పరిశీలిద్దాం.

ఈ పండుగ సీజన్ లో కస్టమర్స్ భారీగా ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నాయి తాజా అధ్యయనాలు. డెలాయిట్ కంపెనీ చేసిన కన్జ్యూమర్ సిగ్నల్స్ రీసెర్చ్ సర్వేలో పాలగొన్న వారిలో 56 శాతం మంది ఈ పండుగ సీజన్ లో ఎక్కువ షాపింగ్ చేయాలని భావిస్తున్నారట. అలాగే ఈ సమయంలో లగ్జరీ వస్తువులు కొనాలని ఎక్కువ మంది ఇంట్రస్ట్ గా ఉన్నారని సర్వే తేల్చింది.

అలాగే, బట్టలు, పర్సనల్ కేర్, డెకరేషన్ ఐటమ్స్, ఎంటర్టైన్మెంట్ ఐటమ్స్ అమ్మకాలు ఈ పండుగ సీజన్ లో ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏదో వస్తువులు కొనేయడమే కాదు.. పర్యటనల కోసమూ చాలామంది ప్లాన్ చేసుకున్నారని తేలింది. దీనికి దేశీయ – అంతర్జాతీయ విమాన బుకింగ్లు పెరగడం రుజువుగా కనిపిస్తోంది కూడా. ఇవన్నీ కస్టమర్స్ పండగ సీజన్ లో ఎక్కువ ఖర్చు పెట్టానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మన దేశ ఆర్ధికవృద్ధి సానుకూలంగా ఉంది. అందువల్ల ప్రీమియం, లగ్జరీ వస్తువులపై ఖర్చు చేసే అలవాటు ప్రజల్లో పెరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల ఖర్చుల నుంచి లగ్జరీ ఖర్చులవైపు వెళ్ళడం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్, కార్లు, బైక్ లు వంటివి, ట్రావెల్ అంటే ఫ్లైట్, ట్రైన్, బస్ వంటి రవాణా సంస్థలు, హాస్పిటాలిటీ అంటే హోటల్స్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో రిటైల్, ఆటోమోటివ్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాలకు చెందిన వారికి ఇది మంచి సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ్లోబల్ టెక్ సంస్థ ది ట్రేడ్ డెస్క్ ఇటీవల చేసిన రీసెర్చ్ లోనూ ఇవే రిజల్ట్స్ వచ్చాయి. వారి రిపోర్ట్ ప్రకారం 70% మంది భారతీయులు పండుగ సీజన్లో ఖర్చు ఎక్కువ చేయడం కోసం రెడీగా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 70 శాతం ఎక్కువ అని ఆ సంస్థ చెబుతోంది.

ఇప్పుడు ఒకసారి గత సీజన్ లో ప్రజలు ఎంత ఖర్చు చేశారు అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. గత ఏడాది పండుగ సీజన్ 45 రోజుల్లో రూ .3.2 లక్షల కోట్లు ప్రజలు ఖర్చు చేశారని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్, స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ చెబుతున్నాయి. కరోనా ముందు కాలంతో పోలిస్తే ఇది 60% ఎక్కువ కావడం గమనార్హం.

ఇక ఈ సీజన్ లో బంగారం కూడా ఎక్కువ కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ పండుగ సీజన్ మార్కెట్లను కళ కళ లాడిస్తుందని రిపోర్ట్స్ స్పష్టం చేయడం వ్యాపార వర్గాలను సంతోష పెడుతోంది. భారీ ఆఫర్లతో కస్టమర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ-కామర్స్ సైట్స్ పోటాపోటీకి రెడీ అవుతున్నాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా కస్టమర్లు భారీగా కొనుగోలు జరపనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తా కథనాలు చదవండి..