Bank Customers Alert: ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. పలు బ్యాంకులు ఇప్పటికే విలీనమైన విషయం తెలిసిందే. విలీనమైన బ్యాంకుల చెక్‌బుక్‌లు, ఎంఐసీఆర్ కోడ్, ఇతర కోడ్‌లు పని చేయవు. అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సర్వీసుల గడువు పొడిగించాయి. ఇక తాజాగా అలహాబాద్ బ్యాంక్‌లో మీకు ఖాతా ఉన్నట్లయితే ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది. అలహాబాద్ బ్యాంక్.. ఇండియన్ బ్యాంకుతో విలీనమైన విషయం తెలిసిందే. అలహాబాద్ బ్యాంకు ఎంఐసీఆర్ కోడ్, చెక్ బుక్ వంటివి అక్టోబర్ 1 నుంచి పని చేయవని సదరు బ్యాంకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంటే అక్టోబర్ 1 తర్వాత ఎవరైనా పాత చెక్ బుక్ ఉపయోగించి.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ లేదా విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా పొందటానికి దగ్గరిలోని ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లి కొత్త చెక్ బుక్స్ పొందాలని ఇండియన్ బ్యాంక్ ట్వీట్ చేసింది. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇప్పటి వరకు సర్వీసులు కొనసాగించినా.. అక్టోబర్ నుంచి నిలిచిపోనున్నారు. అందుకే అలహాబాద్ బ్యాంకు వినియోగదారులు ముందుగానే అప్రమత్తమైన ఇండియన్ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం బెటర్. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఎంఐసీఆర్ (MICR) కోడ్ అనేది బ్యాంకు ఖాతాకు సంబంధించినది. ఈ కోడ్ మాగ్నెటిక్ సిరాతో చెక్ మీద ముద్రించి ఉంటుంది. ఈ కోడ్ లావాదేవీలను రక్షించడానికి బార్‌కోడ్‌తో ఉపయోగపడుతుంది.
అలహాబాద్ బ్యాంకుకు చెందిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ జూలై 1 నుంచే మర్చబడింది. లావాదేవిని కొనసాగించడానికి వినియోగదారులు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. సదరు బ్యాంకును సందర్శించి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను గురించి తెలుసుకోవచ్చు. లేదా www.indianbank.in/amalgamation లింక్‌ని సందర్శించడం ద్వారా కోడ్‌ను కనుగొనవచ్చు.
Enjoy smooth banking transactions without any glitch. The MICR code and cheque books of the erstwhile Allahabad Bank will be discontinued from 01.10.2021. Get new cheque books from your nearest branch or apply through internet banking/mobile banking.#IndianBank pic.twitter.com/xF1Rctppx2
— Indian Bank (@MyIndianBank) July 31, 2021