India Post Office: పోస్టాఫీసు ఖాతా నుండి రూ.10 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తున్నారు? ఈ నిబంధనలు తప్పనిసరి

|

Sep 26, 2022 | 9:23 AM

India Post Office: ప్రస్తుత రోజుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఎక్కవుగా మోసాలు జరిగేవి బ్యాంకింగ్‌ రంగంలోనే. అయితే బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనే చాలా మోసాలు..

India Post Office: పోస్టాఫీసు ఖాతా నుండి రూ.10 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తున్నారు? ఈ నిబంధనలు తప్పనిసరి
India Post Office
Follow us on

India Post Office: ప్రస్తుత రోజుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఎక్కవుగా మోసాలు జరిగేవి బ్యాంకింగ్‌ రంగంలోనే. అయితే బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనే చాలా మోసాలు జరుగుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో అనేక నిబంధనలు కఠినతరం చేశారు. అలాగే ఇప్పుడు పోస్టాఫీసుల్లోనే వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు నిబంధనలలో మార్పులు తీసుకువచ్చింది. మీరు పోస్టాఫీసు ఖాతా నుండి 10 వేల రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే లేదా దానిని ఎవరికైనా బదిలీ చేయాలనుకుంటే, మీరు ప్రత్యేక ధృవీకరణ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు 10 వేల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీని చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధృవీకరణ లేకుండా మీరు 10 వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేయలేరు. మీరు పోస్టాఫీసులో ఖాతాను తెరవడం సురక్షితమైన నిర్ణయం. మీరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో ఖాతాను తెరిచినట్లే, పోస్టాఫీసులో కూడా ఖాతాను తెరవవచ్చు.

దీనితో పాటు మీరు పోస్టాఫీసు పొదుపు ఖాతా నుండి రోజూ డబ్బును కూడా తీసుకోవచ్చు. అయితే పోస్టాఫీసు ద్వారా రూ. 10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేశారు. మీ ఖాతా కూడా పోస్టాఫీసులో ఉంటే మీరు ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్ 25న కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో, ఒక కస్టమర్ రూ. 10,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే దీని కోసం వారికి ప్రత్యేక ధృవీకరణ అవసరం ఉంటుంది.

రూ. 10,000 కంటే ఎక్కువ విత్‌డ్రాయల్ మొత్తంపై వెరిఫికేషన్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే సింగిల్ హ్యాండ్ పోస్టాఫీసుల్లో ఎక్కువ విత్‌డ్రాలకు వెరిఫికేషన్ ప్రక్రియను రద్దు చేశారు. ఇది కాకుండా, కొన్ని షరతులలో పోస్టాఫీసు ద్వారా లావాదేవీలను కూడా తనిఖీ చేయవచ్చు. పోస్టాఫీసులో బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో మోసాల కేసులు తగ్గుతాయి. దీంతో ప్రజలు కూడా మోసాల బారిన పడకుండా కాపాడవచ్చు. అందువల్ల, ధృవీకరణ కోసం మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్‌ను పోస్టాఫీసు ఖాతాకు లింక్ చేయడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

బ్యాంకింగ్‌కు సంబంధించిన మోసాలను నిరోధించడానికి ప్రవేశపెట్టిన నిబంధనలతో పాటు, పోస్టాఫీసు విత్‌డ్రా పరిమితిని కూడా పెంచింది. ఇంతకుముందు ఖాతాదారులు రూ.5000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.20వేలకు పెంచారు. ఇది కాకుండా, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఏ కస్టమర్ ఖాతాలోనూ 50 వేల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలను అంగీకరించరు. దేశంలోని ఏ పౌరుడైనా పోస్టాఫీసులో తన ఖాతాను సులభంగా తెరవవచ్చు. ఇక్కడ కనీస నిల్వ కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే నిర్వహించాలి. ప్రస్తుతం, ఈ ఖాతాపై 4% వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. ఇది ఇతర పొదుపు ఖాతాల కంటే ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి