
విదేశీ ప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలి. అయితే పాస్‌పోర్ట్‌ల విషయంలో జరిగే మోసాలను అరికడుతూ ప్రభుత్వం డిజిటల్ పాస్‌పోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాస్ పోర్ట్ భద్రతను మెరుగుపరచడం, విదేశీ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్ చేయడం, నకిలీ పాస్‌పోర్ట్ లను నిరోధించడం, ట్యాంపరింగ్ నుంచి పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం కోసం ఈ కొత్త డిజిటల్ పాస్‌పోర్ట్ తెచ్చినట్టు తెలుస్తోంది.
ఇ–పాస్‌పోర్ట్ కూడా సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు వర్ణపు ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. లోపల ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ( RFID) టెక్నాలజీతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్ కవర్‌లో చిప్, యాంటెన్నా వంటివి ఉంటాయి. ఈ చిప్ లో వ్యక్తిగత డేటా నిక్షిప్తమై ఉంటుంది. డిజిటల్ పాస్‌పోర్ట్ ద్వారా ఎయిర్‌పోర్ట్ ల్లో అథెంటికేషన్ ఈజీగా జరిగిపోతుంది.
అయితే ప్రస్తుతం ఇపాస్‌పోర్ట్ సేవలు హైదరాబాద్, గోవా, ఢిల్లీ నాగ్‌పూర్, చెన్నై, భువనేశ్వర్, జమ్ము, సిమ్లా, రాయ్‌పూర్, అమృత్‌సర్, జైపూర్, సూరత్, రాంచీ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దేశంలోని అన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలకు అందుబాటులోకి వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి