Bank Lockers: దేశంలో బ్యాంక్ లాకర్ల కొరత.. డిమాండ్, సప్లై మధ్య భారీ అంతరం..

ఈ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మన దేశంలో బ్యాంక్ లాకర్ల లభ్యత తగ్గిపోతోందని ప్రముఖ లాకర్ల స్టార్టప్ ఆర్మ్(Aurm) ఓ నివేదికను అందించింది. దేశంలో డిమాండ్ కు అనుగుణంగా లాకర్ల లభ్యత లేదనిన ఆ నివేదిక స్పష్టం చేసింది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

Bank Lockers: దేశంలో బ్యాంక్ లాకర్ల కొరత.. డిమాండ్, సప్లై మధ్య భారీ అంతరం..
Bank Lockers

Updated on: Mar 06, 2024 | 6:53 AM

విలువైన వస్తువులు, డాక్యుమెంట్ల వంటివి భద్రపరచుకునేందుకు ఉపయోగపడేవి బ్యాంక్ లాకర్లు. వీటిల్లో భద్రత, సౌకర్యం ఉంటుండటంతో ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది ప్రజలు వీటిని వినియోగించుకుంటున్నారు. దీంతో బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున లాకర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మన దేశంలో బ్యాంక్ లాకర్ల లభ్యత తగ్గిపోతోందని ప్రముఖ లాకర్ల స్టార్టప్ ఆర్మ్(Aurm) ఓ నివేదికను అందించింది. దేశంలో డిమాండ్ కు అనుగుణంగా లాకర్ల లభ్యత లేదనిన ఆ నివేదిక స్పష్టం చేసింది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

ఆర్మ్ లెక్క ఇది..

2030 నాటికి భారతీయ నగరాల్లో సేఫ్ డిపాజిట్ స్టోరేజీ లాకర్లు అవసరమయ్యే ఆరు కోట్ల మంది సంపన్న భారతీయులు ఉంటారని ఆర్మ్ అంచనా వేసింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 లక్షల బ్యాంకు లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, లాకర్ల డిమాండ్, లాకర్ల లభ్యత మధ్య అంతరం సుమారు 5.4 కోట్లు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రచురించిన వివిధ నివేదికల నుంచి.. అనేక మంది బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడిన తర్వాత కమిషన్ చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

ఆర్మ్ నివేదిక ప్రకారం, అధిక సాంద్రత కలిగిన పట్టణ సమూహాలలో డిమాండ్-సరఫరా అంతరం పెరుగుతోంది. ఇక్కడ బ్యాంకులు స్థలం కొరత, అధిక అద్దెలను ఎదుర్కొంటాయి.

ఇవి కూడా చదవండి

భారతీయ కుటుంబాలు దాదాపు 22,000-25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉంటాయని అంచనా. దీనికి పూర్తి భిన్నంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి 60 లక్షల లాకర్లు మాత్రమే ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆర్మ్ సహ వ్యవస్థాపకుడు గణేష్ బాలకృష్ణన్ మాట్లాడుతూ లాకర్ల డిమాండ్, సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువ ఉందన్నారు. భారతీయుల కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ ఈ అంతరం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేశంలో అందుబాటులో ఉండే, సురక్షితమైన, సౌకర్యవంతమైన లాకర్ల తక్షణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

భారతీయ కుటుంబాలు తమ ఆస్తులలో 10-15 శాతాన్ని ఆభరణాల రూపంలో లేదా పెట్టుబడిగా దానికి కేటాయిస్తాయి. అయితే కొంతమందికి మాత్రమే బ్యాంకు లాకర్లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా వారు దొంగతనాలు, చోరీలు, మోసాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ల్యాకర్ల నిర్వహణలో సవాళ్లు..

బ్యాంకు లాకర్లను యాక్సెస్ చేస్తున్నప్పుడు ప్రధాన ఆందోళన.. లాకర్లలో భద్రతా ఉల్లంఘనలు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏప్రిల్ 2014, మార్చి 2017 మధ్య, 51 బ్యాంకుల్లో మొత్తం 2,632 దోపిడీ, దొంగతనం, దోపిడి ఘటనల్లో రూ.180 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, వ్యవస్థను సరిదిద్దడానికి ఆర్మ్ బహుళ-స్టేక్ హోల్డర్ విధానాన్ని ప్రతిపాదిస్తోందని బాలకృష్ణన్ అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..