
అత్యంత ధనవంతులు.. కుబేరులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటారని అందరూ అనుకుంటారు.. కానీ, ఇది అవాస్తవం..ఇప్పుడు మన భారత దేశంలోనూ మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదికలో వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం..2024లో భారతదేశ బిలియనీర్ జనాభా భారీగా పెరిగిందని ప్రకటించింది. కన్సల్టెంట్ తన ‘ది వెల్త్ రిపోర్ట్ 2025’లో ఈ డేటాను వెల్లడించింది. భారతదేశం ఇప్పుడు 191 మంది బిలియనీర్లకు నిలయంగా ఉంది. వీరిలో 26 మంది గత సంవత్సరంలోనే ఈ జాబితాలో చేరారు. భారత దేశంలో ఇప్పుడు మొత్తం మిలియనీర్ల సంఖ్య 85,698కు చేరుకొన్నట్టుగా నైట్ ఫ్రాంక్ వివరించింది.
సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టాప్-3లో మన దేశం కూడా ఉన్నట్టు ‘నైట్ ఫ్రాంక్’ నివేదిక వెల్లడించింది. కనీసం రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగినవారిని బిలియనీర్లుగా పిలుస్తారు. కాగా ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరిందని నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, 104 మంది సంపన్నులతో హైదరాబాద్ ముచ్చటగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నట్టు హురున్ ఇండియా రిచ్‌లిస్ట్-2024 నివేదికలో వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో 109 మంది, ఏపీలో 9 మంది సంపన్నులు ఉన్నట్టు నివేదిక వివరించింది. అలాగే, మన దేశంలో అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో అంబానీ కుటుంబం 10.09 లక్షల కోట్లుతో మొదటి స్థానంలో ఉండగా, మిస్త్రీ కుటుంబం 3.25 లక్షల కోట్లుగా ఉంది. జిందాల్ కుటుంబం 2.43 లక్షల కోట్లు, బిర్లా కుటుంబం 1.99 లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి