Tesla Car: ఓకే తగ్గిస్తాం.. మరి మీరు ఇక్కడ ఏం చేస్తారు.. ఎలన్ మస్క్‌ను ప్రశ్నించిన భారత్..

|

Aug 13, 2021 | 1:51 PM

Tesla Car: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ తీరుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.  ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ మేరకు గత నెల ప్రభుత్వం

Tesla Car: ఓకే తగ్గిస్తాం.. మరి మీరు ఇక్కడ ఏం చేస్తారు.. ఎలన్ మస్క్‌ను ప్రశ్నించిన భారత్..
Tesla Car
Follow us on

ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ తీరుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.  ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ మేరకు గత నెల ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పూర్తిగా అనుసంధానించిన కార్లను దిగుమతి చేసుకోవడం కంటే.. పరికరాలను యూనిట్ల వారీగా దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని టెస్లాను వెల్లడించింది.

అలాగే దిగుమతి సుంకాలను తగ్గిస్తే భారత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి కార్యాచరణను సమర్పించాలని అడిగినట్లు  సమాచారం. మరోవైపు భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది.

భారత్‌లో ఇప్పటి వరకు 100 మిలియన్‌ డాలర్లు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసినట్లు టెస్లా వెల్లడించింది. పన్నులు తగ్గిస్తే ఈ విలువ మరింత పెరుగుతుందని పేర్కొంది. అలాగే విక్రయాలు, సేవలు, ఛార్జింగ్‌ వసతుల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది. ఇలా భారత్‌లోకి దశలవారీగా ప్రవేశించి పూర్తి స్థాయి తయారీలో పెట్టుబడులు ప్రారంభిస్తామని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా ప్లాన్ చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు.

కాలిఫోర్నియాకు చెందిన టెస్లా జూలైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 60% నుండి 100% కి తగ్గించాలని కోరింది. కంపెనీ 10% సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జ్‌ని కూడా కోరింది – ఇది అన్ని దిగుమతి చేసుకున్న కార్లపై విధించబడుతుంది.

అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ పార్లమెంటులో స్పందించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దృష్టిలో ప్రస్తుతానికి లేదని స్పష్టం చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..