638.2 బిలియన్ డాలర్లకు చేరుకున్న భారత ఫారెక్స్ నిల్వ! పెరుగులలో హ్యాట్రిక్
శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఫారెక్స్ నిల్వ 7.5 బిలియన్లు డాలర్లు పెరిగింది. ఫిబ్రవరి 7తో ముగిసిన వారంలో, దేశ ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగాయి. గత 16 వారాలలో 11 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ రికవరీ జరిగింది. ఈ పెరుగుల గురించి మరింత వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారత ఫారెక్స్ నిల్వల్లో వరుసగా మూడో వారంలో కూడా పెరుగుదల కనిపించింది. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఫారెక్స్ నిల్వ 7.5 బిలియన్లు డాలర్లు పెరిగింది. ఫిబ్రవరి 7తో ముగిసిన వారంలో, దేశ ఫారెక్స్ నిల్వలు 7.65 బిలియన్లు పెరిగి 638.261 బిలియన్లకు చేరుకున్నాయి. గత 16 వారాలలో 11 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ రికవరీ జరిగింది. సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 704.89 బిలియన్ డాలర్లను తాకిన తర్వాత.. నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది గరిష్ట స్థాయి నుండి దాదాపు 10% తగ్గుదలను సూచిస్తుంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి చేరువలో ఉన్న భారత రూపాయి విలువను స్థిరీకరించడానికి RBI తీసుకున్న చర్యల వల్ల ఈ తగ్గుదల ఎక్కువగా జరిగింది. భారతదేశ ఫారెక్స్ నిల్వలలో విదేశీ కరెన్సీ ఆస్తులు 544.106 బిలియన్ డాలర్లు, బంగారు నిల్వలు 72.208 బిలియన్ డాలర్లుగా న్నాయని తాజా డేటా వెల్లడిస్తుంది.
దాదాపు 11 నెలలుగా అంచనా వేసిన దిగుమతులను ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు కవర్ చేస్తాయని అంచనా వేసింది ఆర్సబీ. 2023లో ఇండియా తన నిల్వలకు దాదాపు 58 బిలియన్ డాలర్లను జోడించింది, ఇది 2022లో కనిపించిన 71 బిలియన్ డాలర్ల క్షీణత నుండి గణనీయమైన రికవరీగా చెప్పుకోవచ్చు. 2024 నుంచి చూసుకుంటే నిల్వలు 20 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. భారత విదేశీ నిల్వల్లో అమెరికన్ డాలర్, యూరో, జపనీస్ యాన్, పౌండ్ స్టెర్లింగ్ వంటి వివిధ రిజర్వ్ కరెన్సీలు ఉన్నాయి. ద్రవ్యతను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఫారెక్స్ నిల్వలు ఎంతో కీలకమైనవి. రూపాయి విలువ తగ్గుదలను నివారించడానికి డాలర్లను అమ్మడం, రూపాయి విలువ బలపడినప్పుడు డాలర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆర్బీఐ తరచుగా ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




