Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు రానుంది. ఈ ప్రాజెక్టు వల్ల గుజరాత్ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సుమారు 284 గ్రామాలు..

Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!
Semi High Speed Rail

Updated on: May 13, 2026 | 8:19 PM

Semi High Speed Rail: భారత రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అహ్మదాబాద్ నుండి ధోలేరా మధ్య సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.20,667 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

స్వదేశీ సాంకేతికతతో తొలి ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడిన మొదటి సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు. సుమారు 134 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త రైల్వే లైన్.. అహ్మదాబాద్, ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (SIR), త్వరలో రాబోతున్న ధోలేరా ఎయిర్‌పోర్ట్, లోథల్ జాతీయ సముద్ర వారసత్వ సముదాయాన్ని (NMHC) అత్యాధునిక రైలు అనుసంధానంతో జోడిస్తుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే ఈ యాప్‌ చెప్పేస్తుంది..!

ఇవి కూడా చదవండి

గంటలోపే ప్రయాణం

ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి ధోలేరా చేరుకోవడానికి పట్టే సమయం ఈ ప్రాజెక్టుతో గణనీయంగా తగ్గనుంది. ప్రయాణికులు కేవలం గంటలోపే ఒక నగరం నుండి మరో నగరానికి చేరుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజూ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

న్యూ ఇండియాకు ప్రతీక: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

“ఈ ప్రాజెక్టు కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు, ఇది నవ భారత ఆధునిక, వేగవంతమైన, ఆత్మనిర్భర రవాణా వ్యవస్థకు ప్రతీక” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా సెమీ హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఈ ప్రాజెక్టు ఒక పునాదిలా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపాధి అవకాశాలు:

ఈ ప్రాజెక్టు వల్ల గుజరాత్ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సుమారు 284 గ్రామాలు, 5 లక్షల మంది జనాభాకు ఈ రైలు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 0.48 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. అలాగే 2 కోట్ల కిలోల CO₂ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 10 లక్షల చెట్లను నాటడంతో సమానం. ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రైల్వే లైన్ నేరుగా అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ రైలు కారిడార్‌తో కూడా అనుసంధానించనుంది.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

ఇది కూడా చదవండి: Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us