
దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం చర్చలను విజయవంతంగా ముగించాయి. ఇది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా విస్తరించడానికి, పెట్టుబడి ప్రవాహాలను పెంచడానికి, ఇరుపక్షాల మధ్య ఆర్థిక సమైక్యతను మరింతగా పెంచుతుందని భావిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు.
చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఒప్పందం ఖరారు అయింది అని అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్ వైపు నుంచి సమతుల్యమైనది, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉందని, EU ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని మరింత దగ్గరగా అనుసంధానించడానికి సహాయపడుతుందని అన్నారు.
అంతకుముందు రోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉండటం జీవితకాల గౌరవం. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా. సురక్షితంగా చేస్తుంది. మనమందరం ప్రయోజనం పొందుతాం అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి