LPG Gas Connection : ఉపాధి కోసం దేశంలో ఎక్కడికైనా వెళితే కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పొందడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్‌ను సులువుగా తీసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) కొత్త ఎల్పీజీ కనెక్షన్‌ను సులభతరం చేయడానికి నిబంధనలను సవరించింది. ఇప్పుడు మీ కుటుంబం ఇండేన్ కనెక్షన్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా కొత్త ఇండేన్ కనెక్షన్‌ను సులభంగా తీసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారం ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ తన ట్వీట్‌లో మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా, మీ కుటుంబం ఇండేన్ కనెక్షన్ ఆధారంగా కొత్త ఇండేన్ కనెక్షన్‌ను సులభంగా పొందండి! అని ట్వీట్ చేసింది. ఉపాధి కోసం మీరు దేశంలో ఎక్కడ ఉన్నా మీ కుటుంబానికి ఉన్న కనెక్షన్ ఆధారంగా ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్ లభిస్తుంది.
కొత్త LPG కనెక్షన్ కోసం అవసరమైన పత్రాలు
కొత్త ఎల్పీజీ కనెక్షన్ పొందడానికి దరఖాస్తు దారుడి ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు, చిరునామా, కుటుంబ కనెక్షన్ వివరాలు అవసరం. ఇండియన్ ఆయిల్ మరో ట్వీట్‌లో ఫేక్ పెట్రోల్ పంప్ డీలర్ ఆఫర్ గురించి అప్రమత్తం చేసింది. RO పంపిణీదారుల కోసం అనధికార వ్యక్తులు / ఏజెన్సీలు బూటకపు ఆఫర్లను ప్రకటిస్తున్నాయని మా దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. OMC సమీప కార్యాలయాన్ని సందర్శించాలని లేదా ప్రామాణీకరణ కోసం http://petrolpumpdealerchayan.in కు లాగిన్ అవ్వాలని ప్రజలకు సూచించింది.
अब आप देश में कहीं भी जाइये, अपने परिवार के #Indane कनेक्शन के आधार पर, नया #Indane कनेक्शन आसानी से पाइये!
पढ़ने या रोज़गार के लिए देश में कहीं भी जाने पर नया #LPG कनेक्शन अब आपके परिवार के मौजूदा कनेक्शन के आधार पर आसानी से उपलब्ध है। pic.twitter.com/YAMJQr7qu5
— Indian Oil Corp Ltd (@IndianOilcl) July 17, 2021