Silver Price: వెండికి పెరుగుతున్న డిమాండ్‌.. ధర మరింత పెరుగుతుందా?

Silver Price: నేడు వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎందుకంటే దీనిని ఆభరణాలు, పాత్రలలో మాత్రమే కాకుండా, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి ఆధునిక పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా..

Silver Price: వెండికి పెరుగుతున్న డిమాండ్‌.. ధర మరింత పెరుగుతుందా?
పెరిగిన వెండి ధర: బుధవారం బంగారం ధర తగ్గితే వెండి పెరిగింది. దేశీయంగా స్పాట్ ధరలు గ్రీన్‌లో ఉన్నాయి. ఢిల్లీలో వెండి స్పాట్ ధర కిలోకు రూ.2000 పెరిగి రూ.1,62,000కి చేరుకుంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. MCXలో వెండి ఫ్యూచర్స్ ధర 0.50 శాతం లేదా రూ.772 పెరుగుదలతో కిలోకు రూ.1,55,459 వద్ద ట్రేడవుతోంది.

Updated on: Nov 04, 2025 | 8:50 PM

Silver Price: ప్రస్తుతం దేశంలో బంగారం ధర పెరిగినట్లే వెండి కూడా పరుగులు పెడుతోంది. అక్టోబర్‌ నెలలో వెండి ధర కిలోకు 2 లక్ష రూపాయల వరకు వెళ్లింది. వెండికి మరింత డిమాండ్‌ పెరిగింది. అయితే ప్రస్తుతం నేడు నవంబర్ 4 వెండి ధర రూ. 1.65 లక్షల వద్ద ఉంది. అంటే ఏ స్థాయిలో వెండి రేటు తగ్గిందో స్పష్టంగా తెలిసిపోతుంది. వెండి ధరలు భవిష్యత్తులో భారీ పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధర దిగి వచ్చినా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ 5,6 తేదీల్లో పాఠశాలలు బంద్‌!

గత 15 రోజుల్లో వెండి ధర నిరంతరం తగ్గుతూ వచ్చింది. కిలోకు రూ.50000కి తగ్గింది. మంగళవారం కిలో వెండిపై రూ.3000 వరకు తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఢిల్లీలో వెండి ధర రూ.1,51,000 వద్ద ట్రేడవుతోంది. కాగా, చెన్నైలో వెండి ధర రూ.1,65,000గా ఉంది. పండుగ సీజన్‌లో ప్రజలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు డిమాండ్ కొంచెం తగ్గింది. అందుకే చెన్నైలో కొన్ని రోజుల క్రితం రూ.206,000 ఉన్న వెండి ధర ఇప్పుడు రూ.165,000 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: PAN Card: డిసెంబర్‌ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

పరిశ్రమలో వెండికి పెరుగుతున్న డిమాండ్

నేడు వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎందుకంటే దీనిని ఆభరణాలు, పాత్రలలో మాత్రమే కాకుండా, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి ఆధునిక పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో దాదాపు 60 నుండి 70 శాతం వెండిని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో దాని ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర:

  • ఢిల్లీ: రూ.1,51,000
  • ముంబై: రూ.1,65,000
  • హైదరాబాద్‌: రూ.1,65,000
  • చెన్నై: రూ. 1,65,000
  • బెంగళూరు: రూ.1,51,000

ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి