Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా.. అయితే, మీకు జరిమానా, జైలు శిక్ష తప్పదా..!

|

Mar 31, 2021 | 3:33 PM

2020-21 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్ ను 2021 మార్చి 31లోపు దాఖలు చేయాల్సి ఉంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్న ఐటీ నిపుణులు.

Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా.. అయితే, మీకు జరిమానా, జైలు శిక్ష తప్పదా..!
Income Tax Returns
Follow us on

Income Tax Returns:  ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిశాక పన్ను చెల్లించేందుకు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలి. 2020-21 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్ ను 2021 మార్చి 31లోపు దాఖలు చేయాల్సి ఉంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని ఖాతరు చేయని వాళ్లు ఆదాయపు పన్ను చట్టం-1961లోని నిబంధన 199(1) ప్రకారం అదనపు వడ్డీ, రుసుములు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే, మార్చి 31 నాటికి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రిటర్నులు సమర్పించకపోతే సంబంధిత వ్యక్తులను టైమ్ బార్డ్ చెల్లింపుదారుడిగా పరిగణిస్తారని ఆర్ఎస్ఎం వ్యవస్థాపకులు డాక్టర్ సురేశ్ సురానా తెలిపారు. టైమ్ బార్డ్ రిటర్నులను ఎలాంటి నిబంధనలు అనుమతించవని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారుడికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉండి రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైతే అతడికి 50 శాతం పన్నుకు సమానమైన జరిమానా విధిస్తారని ఆయన పేర్కొన్నారు. సెక్షన్ 270ఏ కింద ఫైన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అంతేకాకుండా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులను సెక్షన్ 276సీసీ కింద ప్రాసిక్యూషన్ చేసే అవకాశముందన్నారు సురేశ్ సురానా. డిఫాల్ట్ పన్ను చెల్లింపుదారుడు 3 నెలల కంటే తక్కువ సమయం లేకపోయినా కఠినమైన జైలు శిక్షకు గురవుతారన్నారు. అయితే, దీన్ని రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. పన్ను ఎగవేత 25 లక్షల కంటే ఎక్కువ ఉండి రిటర్నులు దాఖలు చేయకపోతే వారికి 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది. 10 వేల లోపు రిటర్నులకు సంబంధించి ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదని సురేశ్ స్పష్టం చేశారు.

ఇన్‌కం టాక్స్ చట్టంలోని సెక్షన్ 119(2) ప్రకారం కాలపరిమితి ముగిసిన తర్వాత లేదా ఏదైనా మినహాయింపు, వాపసు లేదా ఇతర ఉపశమనాల కోసం దరఖాస్తును అంగీకరించే అధికారం.. ఆదాయపు పన్ను అథారిటీ చెల్లింపుదారుడికి ఇస్తుంది. అందువల్ల 2021 మార్చి 31 లోపు రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైనవారు అనంతరం ఆలస్యానికి గల సహేతుకమైన కారణాన్ని చూపించి పన్ను అథారిటికీ దరఖాస్తు చేయవచ్చు. అయితే, ఇది ఆదాయపు పన్ను అథారిటి విచక్షణపై ఆధారపడి ఉంటుందని సురేశ్ తెలిపారు.

అలాగే, సెక్షన్ 139 కింద నిర్ణీత తేదీలోపు రిటర్నులు దాఖలు చేయకపోతే కలిగే పరిణామాలు తర్వాత రిటర్నుల ఆమోదం పొందే సమయంలో119 సెక్షన్ కు సంబంధించిన జాబితా ఓ సారి పరిశీలిద్దాం..

✍ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271 ఎఫ్ ప్రకారం అసెస్‌మెంట్ ఇయర్ 2020-21లో ఇచ్చిన సమయం కంటే రిటర్నులు ఆలస్యమైతే రూ. 10 వేలు ఆలస్య రుసుము చెల్లించాలి.

✍ పన్ను చెల్లింపుదారు ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే అలాంటి వ్యక్తులకు ఆలస్య రుసుము రూ.1,000

✍ చట్టంలో సెక్షన్ 234ఏ ప్రకారం నెలకు ఒక్క శాతం లేదా చెల్లించని పన్ను మొత్తానికి నెలలో కొంత భాగం వర్తిస్తుంది.

✍ పన్ను చెల్లింపుదారుడు కొన్ని తగ్గింపులు కోల్పోయినా లేదా నిర్దేశించిన తేదీకి మించి రిటర్నులు దాఖలు చేసినా నష్టాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇది ఐటీ చట్టంలోని 139(1) నిబంధన ప్రకారం నిర్ణీత తేదీని నిర్దేశిస్తుంది.

✍ కాబట్టి మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయనట్లయితే గడువు పొడిగింపు కోసం ఆలోచించకుండా వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అసెస్‌మెంట్ ఇయర్ 2019-18 గాను ఐటీఆర్ ఫైల్ చేసేందుకు 2020 సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది ఆదాయపు పన్ను శాఖ. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ ఏడాది 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసేందుకు జనవరి 10 వరకు గడువిచ్చింది. ఆడిట్ కేసులకైతే ఫిబ్రవరి 15 వరకు సమయమిచ్చింది. అయితే, ఆఖరి తేదీ వరకూ ఆగకుండా ముందే ఫైల్ చేయడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

Read Also…  ఐఫోన్ తక్కువలో వస్తుంది అని ఆర్డర్ చేస్తే భారీ పార్శిల్ వచ్చింది..కట్ చేస్తే షాక్…! :Buy Cheap IPhone Gets Big Parcel Video.