
మీరు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి రీఫండ్ కోసం చూస్తున్నారా? మీ బ్యాంకు ఖాతాను ధ్రువీకరించాలంటూ మీ ఫోన్‌కు లేదా మెయిల్‌కు మెసేజ్ వచ్చిందా? అయితే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాంటి మెసేజ్‌లు మోసపూరితమైనవి కావచ్చు. ఇలాంటి సందేశాలపై ట్యాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం హెచ్చరిస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కోటీన్నరకు పైగా మంది ఐటీ రిటర్నులు పూర్తి చేసిన క్రమంలో ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తు చేసింది. అనుమానాస్పద మెసేజ్ వస్తే దాని గురించి ముందుగా తెలుసుకోవాలని సూచించింది.
తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలు, సోదాల ద్వారా ఇప్పటికే 40 వేల మంది బోగస్ క్లెయిమ్స్ చేసినట్లు బయటపడింది. వారంతా సుమారు రూ.1000 కోట్ల వరకు తప్పుడు క్లెయిమ్స్ చేసి రీఫండ్ పొందినట్లు గుర్తించింది. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారని, ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని హెచ్చరించింది. అలా తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ చేసిన వారు వెంటనే తమ ఐటీ రిటర్నులను సరి చేస్తూ అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కోరింది. తనిఖీలు నిర్వహించి దొరికితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అలాగే ఇప్పటి వరకు కోటీన్నర మంది వరకు తమ రిటర్నులను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. వారంతా రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి