Income Tax Refund: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 16 వరకు పన్ను చెల్లింపుదారులకు రూ.49వేల 696 కోట్లను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT).. ఏప్రిల్ 1, 2021, ఆగస్టు 16, 2021 మధ్య కాలంలో 22.75 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు 49,696 కోట్ల రూపాయలను రీఫండ్ చేస్తున్నట్లు జారీ చేసింది. 21 లక్షల 50 వేల 668 వ్యక్తిగత కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ 14వేల 608 కోట్ల రూపాయలను రీఫండ్ చేసింది. అదే సమయంలో 1 లక్షా 24 వేల 732 కార్పొరేట్ కేసుల్లో 35 వేల 88 కోట్ల రూపాయల రీఫండ్‌ను జారీ చేసింది. ఈ మొత్తాన్ని చెల్లింపుదారుల ఖాతాకు బదిలీ చేసినట్లు వెల్లడించింది.
ఆదాయపు పన్ను శాఖ పంపిన రీఫండ్ మొత్తం మీ ఖాతాలో వచ్చాయా..? లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఖాతాదారులు ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. తర్వాత ఇక్కడ ఆదాయపు పన్ను రీఫండ్ స్థితిని చెక్ చేయాలి.
ఒక వేళ మీరు ఐటీఆర్ ప్రొఫైల్‌లో ధృవీకరించకపోతే మీ ఆధార్ సహాయంతో రీ-వెరిఫికేషన్ కోసం అభ్యర్థనను పంపాలి. లేదా సంతకం చేసిన ఐటీఆర్-వీ (ITR-V) ఫారమ్‌ను స్పీడ్ పోస్టు ద్వారా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి పంపాలి. ఈ ప్రక్రియ పూర్తి కానంత వరకు మీకు రీఫండ్ జమ చేయబడదు. సీపీఆర్ లేదా అసెస్సింగ్ అధికారికి ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా ఐటీఆర్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని పన్ను చెల్లింపుదారులు డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్థించవచ్చు.
ఈ పన్ను రీఫండ్ చేయడంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. అయితే పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తుంది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుపై పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలస్య రుసుమును వసూలు చేసింది. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్ ఈ తప్పును సరిచేసింది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు వారి నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీని, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇది వరకే ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
అలాగే పన్ను చెల్లింపుదారులు లేటెస్ట్ వెర్షన్ ఐటీఆర్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలని కోరింది. ఇకపోతే సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపు శాఖ పొడిగించిన విషయం తెలిసిందే. ఇది వరకు గడువు జూలై 31 వరకే ఉండగా, గడువు పొడిగించినా కూడా అంటే జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినా కూడా కొంత మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆలస్య రుసుము లేదా వడ్డీని వసూలు చేసింది. చిన్న పొరపాటు వల్ల తలెత్తిన ఈ సమస్య కారణంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలిగించినట్లయింది.
CBDT issues refunds of over Rs. 49,696 crore to more than 22.75 lakh taxpayers between 1st April, 2021 to 16th August, 2021. Income tax refunds of Rs. 14,608 crore have been issued in 21,50,668 cases & corporate tax refunds of Rs. 35,088 crore have been issued in 1,24,732 cases.
— Income Tax India (@IncomeTaxIndia) August 21, 2021