Income Tax Documents: ITR ఫైల్ చేయడానికి ఏ పత్రాలు అవసరం? ఇదిగో పూర్తి వివరాలు

|

Feb 03, 2023 | 7:15 PM

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం ప్రకటించేసింది. రూ. 7 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అయితే పాత పన్ను విధానం కూడా కొనసాగుతుంది..

Income Tax Documents: ITR ఫైల్ చేయడానికి ఏ పత్రాలు అవసరం? ఇదిగో పూర్తి వివరాలు
Income Tax
Follow us on

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం ప్రకటించేసింది. రూ. 7 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అయితే పాత పన్ను విధానం కూడా కొనసాగుతుంది. దీని కింద రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పన్ను విధించబడుతుంది. అయితే, పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూ. 3 లక్షలకు పైబడిన ఆదాయం కూడా పన్ను మినహాయింపుకు అర్హమైనది. పన్ను బాధ్యతను తగ్గించడానికి అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. అయితే అందుకు కొన్ని పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ లేదా ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి అవసరమైన అన్ని పత్రాల సమర్పించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) సహకారానికి సంబంధించిన పత్రాలు

  • జీవిత బీమా చెల్లింపు రసీదులు
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు రసీదు
  • హోమ్ లోన్ రీపేమెంట్ వివరాలు
  • స్టాక్ మార్కెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లలో పాలుపంచుకున్నట్లయితే సంబంధించిన పత్రాలు.
  • నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో పెట్టుబడికి సంబంధించిన పత్రాలు.

ఐటీఆర్‌ ఫైల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్లు అవసరం?

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులు తమ స్థూల జీతం, ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయ వివరాలను అందించవలసి ఉంటుంది. ఇందుకోసం పన్ను చెల్లింపుదారులు సకాలంలో రికార్డులను సేకరించి నిర్వహించడం మంచిది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఆధార్, పాన్ కార్డ్:

  1. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను అందించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం.. ఆధార్ వివరాలను అందించడం తప్పనిసరి.
  2. ఫారం 16: వేతన వర్గం కోసం ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రం ఫారం 16. ఇది ఉద్యోగి జీతం నుండి టీడీఎస్‌ తగ్గింపునకు సంబంధించి యజమాని కంపెనీలు జారీ చేసిన సర్టిఫికేట్. అయితే కట్‌ అయిన టీడీఎస్‌ని తిరిగి పొందాలంటే కూడా ఇది అవసరం.
  3. జీతం స్లిప్: ఐటీఆర్‌ ఫైల్ చేసేటప్పుడు శాలరీ స్లిప్ లేదా జీతం స్లిప్ మరొక డాక్యుమెంట్ అవసరం. ఇది ఇంటి అద్దె భత్యం, రవాణా భత్యం, ఇతర అలవెన్సుల గురించి సమాచారం ఉంటుంది. ఇది పన్ను లెక్కింపు కోణం నుండి చాలా ముఖ్యమైన పత్రం.

పోస్టాఫీసు, బ్యాంకు పొదుపు వడ్డీ సంబంధిత పత్రం:

  • మీరు బ్యాంక్ ఖాతాల నుండి స్వీకరించే వడ్డీ, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లలో చేసిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీపై పన్ను విధించబడుతుంది. ఐటీఆర్ సమర్పించే సమయంలో వీటికి సంబంధించిన పత్రాలను అందించాల్సి ఉంటుంది.

పన్ను ఆదా పెట్టుబడి పత్రాలు:

  • సెక్షన్ 80C, 80CCCD (1) పన్ను ఆదా చేసే పెట్టుబడి పత్రాలు పన్ను మినహాయింపు అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమాకు సంబంధించిన పత్రాలు అందించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పొందడం కూడా అవసరం. ఈ సెక్షన్ల కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఆరోగ్య బీమా ప్రీమియం రసీదు:

  • ఐటీఆర్‌ ఫైల్ చేసేటప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియం రసీదు కూడా అవసరం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపుకు అర్హమైనది. గరిష్టంగా రూ. 25,000 పన్ను మినహాయింపు అనుమతించబడుతుంది. తల్లిదండ్రులు 60 ఏళ్లలోపు, ఆరోగ్య బీమా కలిగి ఉంటే రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

మూలధన లాభాల పత్రాలు

  • మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఐటీఆర్ సమర్పించేటప్పుడు దాని నుంచి ఆర్జించిన మొత్తానికి సంబంధించిన పత్రం అవసరం. ఇది కాకుండా ఇల్లు, భవనం లేదా ఆస్తిని విక్రయించినట్లయితే సంబంధిత పత్రాలు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు లేదా మధ్యవర్తుల స్టేట్‌మెంట్‌లు అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి