Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ

|

Aug 14, 2021 | 2:53 PM

Income Tax: ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ
Income Tax
Follow us on

Income Tax: ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించనుంది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుపై పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలస్య రుసుమును వసూలు చేసింది. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్‌ ఈ తప్పును సరిచేసింది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు వారి నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీని, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

అయితే 22.61 లక్షలకుపైగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ రూ.47,318 కోట్లకుపైగా ఆదాయపు పన్ను రిఫండ్‌ చేస్తున్నట్లు జారీ చేసింది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ (CBDT) ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఆగస్టు 9, 2021 మధ్య ఈ ఐటీ రీఫండ్‌ చేయనుంది. అంతేకాకుండా పన్ను చెల్లింపుదారులు లేటెస్ట్ వెర్షన్ ఐటీఆర్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలని కోరింది. ఇకపోతే సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపు శాఖ పొడిగించింది. ఇది వరకు గడువు జూలై 31 వరకే ఉండేది. గడువు పొడిగించినా కూడా అంటే జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినా కూడా కొంత మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆలస్య రుసుము లేదా వడ్డీని వసూలు చేసింది. ఈ డబ్బులను మళ్లీ వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే చిన్న పొరపాటు వల్ల తలెత్తిన ఈ సమస్య కారణంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలిగించినట్లయింది. ఈ సమస్యను గురించి వారి డబ్బులను వాపసు ఇస్తున్నట్లు ప్రకటించింది.

 

ఇవీ కూడా చదవండి

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.1 డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!