
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇటీవల జననివేష ఎస్‌ఐపీను ప్రారంభించింది, ఈ ఎస్‌ఐపీల్లో కేవలం నెలకు రూ.250 పెట్టుబడితో పెట్టుబడి ప్రయాణం ప్రారంభించవచ్చు. గ్రామీణ, సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల నుంచి చిన్న మొత్తాలతో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌ఐపీలో ముఖ్యమైన విషయం స్థిరత్వం. మీ పెట్టుబడి మొత్తం చిన్నదా కాదా అనేది పట్టింపు లేదు, కానీ మీరు పెట్టుబడి పెడుతూనే ఉన్నంత వరకు మీ కార్పస్ పెరుగుతుంది. అలాగే భవిష్యత్‌లో అనేక రెట్లు రాబడిని ఇవ్వగలదు. కాబట్టి పెట్టుబడిదారులు జననివేష్ కింద నెస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది హైబ్రిడ్ డైనమిక్ ఆస్తి కేటాయింపు పథకంగా ఉంది. రిస్క్‌ను నిర్వహిస్తూనే రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది.
ప్యూర్ ఈక్విటీ లేదా డెట్ ఫండ్ల మాదిరిగా కాకుండా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ మార్కెట్ తిరోగమనాల సమయంలో స్థిరత్వాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో జననివేష్ కింద ఎస్‌ఐఈపీ ద్వారా ప్రతి నెలా రూ. 250 స్థిరంగా మరియు శ్రద్ధగా పెట్టుబడి పెడితే మీ కార్పస్ 40 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 12 శాతం రాబడితో సుమారు రూ. 29,70,605 లక్షలు అవుతుంది. తద్వారా మొత్తం రూ.1,20,000 పెట్టుబడితో 40 సంవత్సరాలలో రూ.28,50,605 లాభం వస్తుంది. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ మొత్తం ఏయూఎం జనవరి 31, 2025 నాటికి రూ. 33305.48 కోట్లుగా ఉంటే ప్రస్తుత ఎన్‌ఏవీ రూ. 14.40గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి