Dried Mango Leaves: అక్కడ ఎండిన మామిడాకులకు ఫుల్ డిమాండ్.. కిలో రూ. 150కి కొనుగోలు.. రైతులు హర్షం..

|

Feb 05, 2022 | 5:18 PM

Dried Mango Leaves: మామిడి ఆకులకు హిందూవుల పూజలల్లో, శుభకార్యాల్లో అత్యంత పవిత్ర స్థానం. ఇంట్లో ఏ ఫంక్షన్ పెళ్లి పేరంటం జరిగినా వెంటనే గుమ్మాలకు పచ్చని మామిడాకులు(Mango Leaves) వేలాడాల్సిందే..

Dried Mango Leaves: అక్కడ ఎండిన మామిడాకులకు ఫుల్ డిమాండ్.. కిలో రూ. 150కి కొనుగోలు.. రైతులు హర్షం..
Dried Mango Leaves
Follow us on

Dried Mango Leaves: మామిడి ఆకులకు హిందూవుల పూజలల్లో, శుభకార్యాల్లో అత్యంత పవిత్ర స్థానం. ఇంట్లో ఏ ఫంక్షన్ పెళ్లి పేరంటం జరిగినా వెంటనే గుమ్మాలకు పచ్చని మామిడాకులు(Mango Leaves) వేలాడాల్సిందే. అయితే పల్లెల్లో ఈ మామిడాకులు ఫ్రీగానే దొరుకుతాయి. పట్టణాల్లో, నగరాల్లో మాత్రం మార్కెట్ లో లేదా ఆన్ లైన్ లో లభ్యమవుతాయి. అయితే పచ్చని మామిడాకులకే కాదు.. ఇప్పుడు ఎండిన మామిడాకులకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మామిడి ఆకుల్లో ఔషధ గుణాలున్న సంగతి తెలిసిందే. దీంతో ఓ కంపేనీ ఎండిన మామిడాకులను ఉపయోగించి దంతాలను శుభ్రం చేసుకునే పళ్ళపొడిని తయారు చేస్తోంది. అందుకనే ఎండిన మామిడాకులను రైతులనుంచి కిలోల లెక్కన కొనుగోలు చేస్తోంది. దీంతో . ఎండిపోయిన మామిడి ఆకులకు బాగా డిమాండ్ వచ్చిందట. వివరాల్లోకి వెళ్తే..

కేరళ లోని కాసర్‌గోడ్‌లోని మామిడి రైతులకు శుభవార్త.. ఎండిన మామిడి ఆకులకు కిలో రూ. 150లకు అమ్ముకోవచ్చు. ఇది కిలో మామిడిపండుకంటే ఎక్కువ ధర. ఈ ఎండిన మామిడి ఆకులను ఈనో వెల్‌నెస్‌ నికా అనే సంస్థ కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ కిలో మామిడి ఆకులను 150 రూపాయలకు కొనుగోలు చేసి.. ఆర్గానిక్ పళ్లపొడిని తయారు చేసేందుకు ఉపయోగిస్తోందట. ఇలా ఈ మామిడి ఆకులు నుంచి పళ్లపొడి చేసేందుకు ఈ సంస్తకు పేటెంట్‌ హక్కులు కూడా ఉన్నాయట. దీంతో ఇప్పుడు టూత్ పౌడర్ తయారీ కోసం ఈ సంస్థ మామిడి ఆకులు కొంటామని ప్రకటన ఇచ్చింది. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి రెడీ అవ్తున్న నేపధ్యంలో ఇప్పుడు తయారీ కోసం కావాల్సిన ముడి సరకు కొనుగోలుపై దృష్టి పెట్టింది.

కేరళలోని కన్నూర్, కాసర్‌ గోడ్‌ ప్రాంతాల్లోని గ్రామాలన్నింటి మామిడి ఆకుల సేకరణ ప్రారంభించింది. ‘ఎనో వెల్‌నెస్ నికా’ అనే టూత్‌పౌడర్ కంపెనీ టూత్ పౌడర్ ఉత్పత్తికి ప్రధాన అంశంగా ఎండిన మామిడి ఆకులను సేకరిస్తోంది. అయితే ఈ పండిన మామిడి ఆకులను పరిశుభ్రమైన పరిసరాల్లో.. సహజంగా శుభ్రంగా ఎండబెట్టాలి అనే కండిషన్ పెట్టింది. ఇలా సహజంగా మామిడి ఆకులకు కిలోకి రూ. 150 లు చెల్లిస్తోంది. అయితే తమకు డబ్బులు వద్దు అనుకునే రైతులకు కంపెనీలో షేర్ ను ఇస్తోంది. ప్రతి రెండు కిలోల మామిడి ఆకులకు ఆ సంస్థ ఒక షేరు ఇస్తుందట. ఇప్పటికే తాము కన్నూర్‌, కాసర్‌గోడ్‌ జిల్లాల్లోని అన్ని పంచాయతీల నుంచి ముడిసరుకును కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని .. తమ సిబ్బందిని పంపి ఎండిన మామిడి ఆకులు సేకరిస్తున్నామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబ్రహం తెలిపారు.

Also Read:

5 నిమిషాల ఛార్జ్‌తో రోజంతా పనిచేసే ఒప్పో కొత్త వాచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?