Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. తక్కువ వడ్డీతో తీసుకునే ఆఫర్ ఒకటి ఉంది. దీంతో మీరు బంగారం తనఖా పెట్టి రుణం తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
అంతేకాకుండా గోల్డ్ లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ఇంకా ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు చొప్పున బంగారంపై రుణ వడ్డీ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంది.
ఇక బంగారంపై రుణం కావాలని అనుకునే వారు బంగారాన్ని తీసుకొని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచుకు వెలితే సరిపోతుంది. 30 నిమిషాల్లోనే లోన్ డబ్బులు తీసుకోవచ్చు. అలాగే వడ్డీ చెల్లింపునకు 5 నుంచి 7 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ కూడా లభిస్తుంది. కాగా, ఈ మధ్య కాలంలో బంగారు రుణాలపై చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో తక్కువ వడ్డీకి ఇస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.