
SBI YONO App: ప్రస్తుతం వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక సందేశం వైరల్ అవుతోంది. ఇది చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను భయపెడుతోంది. SBI వినియోగదారులు తమ ఆధార్-లింక్డ్ KYC వివరాలను అప్‌డేట్ చేయడానికి వెంటనే APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని సందేశంలో ఉంది. అలా చేయడంలో విఫలమైతే SBI YONO యాప్ షట్ డౌన్ అవుతుందని కూడా సందేశం హెచ్చరిస్తోంది. మొత్తం మీద ఈ ఎస్బీఐ యాప్ కు ఆధార్ లింక్ చేయాలని సందేశం అర్థం.
ఈ వాదన చాలా మంది SBI కస్టమర్లలో గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే వారు ఆ సందేశం నిజమో కాదో అర్థం చేసుకోలేకపోయారు. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి వినియోగదారులు APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందని, ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే SBI YONO యాప్ మూసివేయబడుతుందని కూడా అందులో పేర్కొంది. SBI పేరుతో సోషల్ మీడియాలో ఒక సందేశం ప్రసారం అవుతోందని, అందుకే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా అబద్ధమని PIB ఫ్యాక్ట్ చెక్ బృందం సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Govt Employee: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. జనవరి 31లోపు ఈ పని చేయకుంటే జీతం, ప్రమోషన్ నిలిపివేత!
పీఐబీ సందేశంలో స్పష్టంగా ఇలా ఉంది. ఇది పూర్తిగా అబద్దమని, ఏ APK లను డౌన్‌లోడ్ చేయవద్దు లేదా మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ లేదా ఆధార్ సంబంధిత సమాచారాన్ని పంచుకోవద్దు అని పీఐబీ సూచిచింది. ఎస్‌బీఐ అలాంటి సమాచారాన్ని అడగదు. ఎస్‌బీఐ తన కస్టమర్లను SMS, WhatsApp లేదా ఇమెయిల్ ద్వారా పంపిన లింక్‌ల నుండి APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయమని లేదా ఆధార్ వివరాలను నవీకరించమని అడగదని Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Telangana Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
బ్యాంక్ ప్రకారం.. మోసగాళ్ళు ఆధార్ లేదా KYC అప్‌డేట్‌ల కోసం అని చెప్పుకుంటూ SBI YONO పేరుతో నకిలీ APK లింక్‌లను వ్యాప్తి చేస్తున్నారు. యాప్‌ను ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత బ్యాంక్ లాగిన్ వివరాలు, OTPలు, వ్యక్తిగత డేటా వంటి విలువైన సమాచారాన్ని దొంగిలించవచ్చని బ్యాంక్ చెబుతోంది. ఇది అనధికార లావాదేవీలు, ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు.
ఇది కూడా చదవండి: School Holidays: ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలల సెలవులు పొడిగింపు!
బ్యాంకింగ్ యాప్ అప్‌డేట్‌ల ముసుగులో స్కామర్లు నకిలీ APK లింక్‌లను పంపుతున్నారని ఎస్‌బీఐ పేర్కొంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా దీనిని మోసపూరిత పథకంగా అభివర్ణించింది. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని కస్టమర్‌లను కోరింది. యాప్‌లను ఎల్లప్పుడూ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని బ్యాంక్ స్పష్టంగా పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి