ITR Filing Tips : ఇలా చేస్తే అనవసరపు ఫైన్ నుంచి రక్షణ.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండిలా..!

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేది జూలై 31గా ఉంది. ఏప్రిల్ 1 2023 నుంచి కొత్త అసెస్‌మెంట్ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలి? వంటి విషయాల గురించి ఎక్కువ శోధిస్తూ ఉంటారు.

ITR Filing Tips : ఇలా చేస్తే అనవసరపు ఫైన్ నుంచి రక్షణ.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండిలా..!
Income Tax

Updated on: Mar 31, 2023 | 5:00 PM

మనం సంపాదించిన ఆదాయం నిర్ధిష్ట పరిధి దాటితే కచ్చితంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేది జూలై 31గా ఉంది. ఏప్రిల్ 1 2023 నుంచి కొత్త అసెస్‌మెంట్ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలి? వంటి విషయాల గురించి ఎక్కువ శోధిస్తూ ఉంటారు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారు రిటర్న్స్ ఫైల్ చేయడం ఆలస్యమైతే రూ.5000 ఫైన్ చెల్లించాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. నిర్ధిష్ట నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేయడానికి ముగింపు తేదీకి ముందే ఆదాయపు పన్నురిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. అయితే ఆదాయపు పన్ను చెల్లించడంలో ఫెయిల్ అయితే దాని ద్వారా వచ్చే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్

పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయడానికి ఆఫ్‌లైన్ యుటిలిటీలను ఉపయోగించాలి. అయితే ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోవాలి. 

ఆన్‌లైన్ ఐటీఆర్ ఫైల్ చేయడం ఇలా

స్టెప్-1 : ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

స్టెప్-2 : మీ పాన్ వివరాలను ఎంటర్ చేసి పాస్ వర్డ్ నమోదు చేసుకుని క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఈ ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వవచ్చు.

స్టెప్-3 : ఈ ఫైల్ మెనూపై క్లిక్ చేసి ఆదాయపు రిటర్న్ పేజీపై క్లిక్ చేయాలి.

స్టెప్-4 : పాన్ స్వయం చాలకంగా ఉంటుంది. అనంతరం అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. ఐటీఆర్ ఫారమ్ నెంబర్ ఎంచుకోవాలి. ఫైలింగ్ టైప్‌ను ఒరిజనల్/రివైజ్డ్‌గా ఎంచుకోవాలి. సమర్పణ మోడ్‌ను ఆన్‌లైన్ అని ఎంచుకోవాలి.

స్టెప్-5 : అనంతరం కొనసాగించు వద్ద క్లిక్ చేయాలి.

స్టెప్-6 : అన్ని సూచనలు జాగ్రత్తగా చదివాలి. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లో వర్తించే, తప్పనిసరి ఫీల్డ్స్‌లో వివరాలను ఎంటర్ చేయాలి

స్టెప్-7 : చెల్లించిన పన్నులు, ధ్రువీకరణ ట్యాబ్‌లో సంబంధిత ధ్రువీకరణ ఎంపికను ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ధ్రువీకరించడానికి మూడు ఎంపికల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. 

స్టెప్-8 : ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఐటీఆర్‌లో డేటాను ధ్రువీకరించాలి.

స్టెప్-9 : అనంతరం ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి.

స్టెప్-10 : ‘నేను ఈ వెరిఫై చేయాలని అనుకుంటున్నాను’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఈ ధ్రువీకరణ పద్ధతులు అందుబాటులో ఉంటాయి. మీరు అడిగినప్పుడు ఈవీసీ/ఓటీపీను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

స్టెప్-11 : ఈవీసీ/ఓటీపీని ఓ నిమిషం లోపు ఎంటర్ చేయాలి. ఇలా చేయకపోతే ఐటీఆర్ స్వయం చాలకంగా సమర్పించబడుతుంది. సమర్పించిన ఐటీఆర్ ఈ రిటర్న్‌ను ఉపయోగించిన తర్వాత ధ్రువీకరించాలి. మీరు సంతకం చేసిన ఐటీఆర్-వీను సీవీసీకు పంపవచ్చు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం