Okaya Monsoon Offers: ఈవీ స్కూటర్ కొనుగోలు చేస్తే థాయ్‌లాండ్ ట్రిప్.. ఒకాయా అదిరిపోయే ఆఫర్

మధ్యతరగతి వారిని ఆకట్టుకురనేందుకు కంపెనీలు కూడా ఈవీలపై ఎప్పటికప్పుడు నూతన ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఒకాయా సరికొత్త ఆఫర్‌తో వచ్చింది. ఒకాయా మాన్‌సూన్ ఆఫర్లలో భాగంగా ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే వారికి యాభై వేల రూపాయల విలువైన థాయ్‌లాండ్ ట్రిప్‌ను ఆఫర్ చేస్తుంది.

Okaya Monsoon Offers: ఈవీ స్కూటర్ కొనుగోలు చేస్తే థాయ్‌లాండ్ ట్రిప్.. ఒకాయా అదిరిపోయే ఆఫర్
Okaya Electric Scooter

Updated on: Jun 29, 2023 | 4:30 PM

భారతదేశంలో ఈవీ వాహనాల కొనుగోలు జోరు ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే అధికంగా ఈవీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఈవీలను లాంచ్ చేస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రో ధరల ఈవీ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారిని ఆకట్టుకురనేందుకు కంపెనీలు కూడా ఈవీలపై ఎప్పటికప్పుడు నూతన ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఒకాయా సరికొత్త ఆఫర్‌తో వచ్చింది. ఒకయా మాన్‌సూన్ ఆఫర్లలో భాగంగా ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే వారికి యాభై వేల రూపాయల విలువైన థాయ్‌లాండ్ ట్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. అంతే కాదు అదనం క్యాష్ బ్యాక్ రివార్డులను కూడా అందజేస్తుంది. ఈ మాన్‌సూన్ ఆఫర్లు జూలై 31, 2023 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఒకయా ఫాస్ట్ సిరీస్‌కు చెందిన ఈవీ స్కూటర్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే తాజా ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫాస్ట్ ఎఫ్ 4, ఫాస్ట్ ఎఫ్ 3, ఫాస్ట్ ఎఫ్ 2బి, ఫాస్ట్ ఎఫ్ 2 టీ స్కూటర్ల కొనుగోలుపై రూ.500 నుంచి రూ.5000 వరకూ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే ఓ వ్యక్తికి రూ.50 వేల విలువైన థాయ్‌లాండ్ ట్రిప్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 నిబంధనలు సడలించి పలు సబ్సిడీలను ఎత్తివేయడంతో ఒకాయా ఫాస్ట్ స్కూటర్ల ధరలు భారీగా పెరిగాయి.

ముఖ్యంగా ఫాస్ట్ ఎఫ్ 4, ఫాస్ట్ ఎఫ్ 3, ఫాస్ట్ ఎఫ్ 2బి, ఫాస్ట్ ఎఫ్ 2 టీ స్కూటర్ల ధరలు గణనీయంగా పెంచినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఒకయా ఫాస్ట్ ఎఫ్ 4 ధర రూ.1,13,999గా ఉండే ధర ప్రస్తుతం రూ.1,39,951కు చేరింది. అలాగే ఫాస్ట్ ఎఫ్ 3 ధర రూ.1,04,999గా ఉంటే ప్రస్తుతం రూ.1,29,948కు చేరింది. ఒకయా ఫాస్ట్ ఎఫ్2బీ ధర రూ.1,10,745కు చేరింది. ఫాస్ట్ ఎఫ్ 2టీ ధర రూ.1,07,903కు చేరింది. అయితే గతంలో ఆయా స్కూటర్లపై రూ.66,000 వరకూ సబ్సిడీ వచ్చేది. అయితే ఈ సబ్సిడి ప్రస్తుతం రూ.22,500కు సెట్ చేయడంతో ధరలు పెరిగాయి. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో సేల్స్ తగ్గే అవకాశం ఉండడంతో కంపెనీ తాజా ఆఫర్లను ప్రకటించిందని మార్కెట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి