Real Estate: అద్దెకు ఉండటం మంచిదా? కొత్త ఇల్లు కొనడం లాభమా? నిర్ణయం తీసుకొనే ముందు ఇది చదవండి..

| Edited By: Ram Naramaneni

Oct 18, 2023 | 7:58 PM

జీవితాంతం అద్దె ఇంట్లో ఉండటం మంచిదా? లేక ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడం మంచిదా అంటే? దేని ప్రయోజనాలు దానికుంటాయి. అయితే మీరు ఏదైనా ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కడ ఇల్లు కొనుగోలు చేయడమే ఉత్తమమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మీరు ఇంటిపై పెట్టే పెట్టుబడి స్థిరమైనది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

Real Estate: అద్దెకు ఉండటం మంచిదా? కొత్త ఇల్లు కొనడం లాభమా? నిర్ణయం తీసుకొనే ముందు ఇది చదవండి..
Real Estate
Follow us on

ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణం. అది ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా తప్పదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం అనివార్యం. అలా వెళ్లిన సందర్భాల్లో సాధారణంగా అందరూ ఇంటిని రెంట్ కి తీసుకుంటూ ఉంటారు. అదే సులభమని అందరూ భావిస్తారు. అయితే ఎక్కువ సంవత్సరాలు ఒకే నగరంలో ఉండాల్సి వస్తే మీరు చెల్లించే అద్దె మొత్తం లెక్కిస్తే మీకు ఓ సొంత ఇల్లు వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే జీవితాంతం అద్దె ఇంట్లో ఉండటం మంచిదా? లేక ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడం మంచిదా అంటే? దేని ప్రయోజనాలు దానికుంటాయి. అయితే మీరు ఏదైనా ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కడ ఇల్లు కొనుగోలు చేయడమే ఉత్తమమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మీరు ఇంటిపై పెట్టే పెట్టుబడి స్థిరమైనది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. కానీ కొన్ని విషయాలను బేరీజు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

పొదుపుల వినియోగం..

మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంకులు మీకు లోన్ సదుపాయాన్ని అందిస్తాయి. అయితే ఆ ప్రాపర్టీ ధరలో 80శాతాన్ని ఆర్థిక సంస్థలు అందిస్తాయి. మిగిలిన 20శాతం మీరు డౌన్ పేమెంట్ల చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం మీ సేవింగ్స్ మొత్తం వినియోగించాల్సి రావచ్చు. కాబట్టి, ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకునే సమయంలో, ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సరిగ్గా అంచనా వేయాలి. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. వాటికి కచ్చితంగా మన వద్ద సమాధానం ఉండి తీరాలి. లేకుంటే ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాత ఇబ్బందులు తప్పవు. మొదటిగా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాత కూడా మీ ఖర్చులను సమర్థంగా నిర్వహించుకోగలరో లేదో బేరీజు వేసుకోవాలి. అలాగే నెలవారీ ఈఎంఐ చెల్లిస్తూ.. ఇతర ఖర్చులకు మిగులు ఉంటుందా? భవిష్యత్తులో రాబోయే ప్రధాన ఖర్చులు ఏమిటి? అత్యవసర, ఆకస్మిక అవసరాలకు ఏమైనా బ్యాక్ అప్ సోర్స్ ఉందా? భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశం ఉందా? వంటివి సరిచూసుకోవాల్సి ఉంటుంది.

అద్దెకు తీసుకుంటే ప్రతికూలతలు..

  • మీరు ఇంటిని అద్దెకు తీసుకుంటే.. మీరు మీరు నివసించాలనుకునే నగరాన్ని బట్టి ఒక నెల నుంచి 11 నెలల విలువైన అద్దెకు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి రావచ్చు.
  • మీరు అద్దెకు వెచ్చిస్తున్న డబ్బు ఒకవేళ ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించే ఈఎంఐ కన్నా తక్కువ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఈఎంఐ కంటే అద్దె ఎక్కువగా ఉంటే, ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఎంపిక.
  • అద్దెకు ఉండడం అంటే తరచూ బ్రోకరేజ్ ఛార్జీలు, బదిలీ ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది.
    అద్దెకు ఉంటున్న సందర్భంలో ఏటా అద్దె పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి.

సొంత ఇంటితో స్థిరత్వం..

  • ఇల్లు కొనడం ఆర్థిక భద్రత, భరోసా లభిస్తుంది.
  • ఇది దీర్ఘకాలంలో హామీతో కూడిన రాబడికి దారి తీస్తుంది. రియల్ ఎస్టేట్ ధరలు, ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి.
  • మీరు గృహ రుణం పొందినప్పుడు ఇంటిని కొనుగోలు చేయడం వల్ల పన్ను మినహాయింపులు అదనపు ప్రయోజనం.
    సొంత ఇల్లు వ్యక్తిగత సంపదలో దీర్ఘకాలిక వృద్ధికి దారితీస్తుంది.
  • మీ సొంత ఇల్లు మీకు వాడుకలో స్వేచ్ఛను అలాగే మీ ప్రాంగణం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారనే దాని గురించి సృజనాత్మక స్వేచ్ఛను అందిస్తుంది.

దీర్ఘకాలిక నిబద్ధత..

ఇంటిని సొంతం చేసుకోవడం అనేది ‘పెద్ద’ ఆర్థిక నిర్ణయం. ఎందుకంటే ఇది సాధారణంగా మీ సంపాదనలో గణనీయమైన మొత్తాన్ని ఈఎంఐకి చెల్లించే దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుంది.
మీరు ప్రణాళికాబద్ధంగా పని చేయకపోతే గృహ రుణం భారంగా మారవచ్చు. మీరు గృహ రుణం ద్వారా ఇంటిని కొనుగోలు చేసినట్లయితే మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ఇబ్బందులు పడతారు.

ఇవి కూడా చదవండి

అద్దెకు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • మీరు మారుతున్న నివాస అవసరాలకు అనుగుణంగా మీరు ఎక్కడైనా నివసించవచ్చు.
  • మీరు చిన్న అద్దెతో నగరంలోని ప్రధాన ప్రదేశంలో అధిక-విలువ ఆస్తిని ఆస్వాదించవచ్చు.
  • మీకు కావలసినప్పుడు, మీరు మెరుగైన గృహాలకు అప్‌గ్రేడ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..