AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: అలాంటి వారు క్రెడిట్ కార్డులు తీసుకుంటే కుప్పలుగా అప్పులు.. నిపుణులు చెప్పే మాటలు వింటే షాక్..!

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బ్యాంకులు ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా పెరిగింది. చాలా మంది చిన్న చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడే బదులు క్రెడిట్ కార్డులు తీసుకోవడమే ఉత్తమం అని భావిస్తున్నారు. ఇప్పుడు చిన్న అవసరాలకే అని తీసుకునే క్రెడిట్ కార్డు భవిష్యత్‌లో అప్పుల ఊబిలో కూరుకునేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Credit Cards: అలాంటి వారు క్రెడిట్ కార్డులు తీసుకుంటే కుప్పలుగా అప్పులు.. నిపుణులు చెప్పే మాటలు వింటే షాక్..!
Credit Cards
Nikhil
|

Updated on: Mar 17, 2025 | 8:44 PM

Share

ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. బ్యాంకులు కూడా వినియోగదారులను పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తూ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డుల జోరు భారీగా పెరిగింది. ఉద్యోగస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఫైనాన్షియల్ డిసిప్లేన్ లేని వారు ఇలా క్రెడిట్ కార్డులను తీసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్న వారు క్రెడిట్ కార్డులను తీసుకుంటే చాలా ఇబ్బందిపడతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లక్షణాలు ఉన్న వారు క్రెడిట్ కార్డులు తీసుకోకూడదో? ఓ సారి చూద్దాం.

షాపింగ్ అలవాట్లు

కొంతమందికి తాము చూసే ప్రతిదాన్ని కొనాలని అనిపిస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్తే చాలు ఏదైనా వస్తువు కొనకుండా ఇంటికి రాలేదు. దీనిని ఇంగ్లీషులో “ఇంపల్సివ్ షాపింగ్” అని పిలుస్తారు. ఈ తరహా లక్షణాలు ఉన్న వారు క్రెడిట్ కార్డుల తీసుకుంటే అవసరం ఉన్నా.. లేకపోయినా అధికంగా కొనుగోళ్లు చేసి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈఎంఐ

కొంతమంది రుణాలు, గ్రూప్ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకుంటూ ఉంటారు. అందువల్ల క్రమం తప్పకుండా ఆయా రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా క్రెడిట్ కార్డుల తీసుకునే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఉత్సాహంగానే ఉంటుంది కానీ బిల్లు కట్టినప్పుడు మాత్రమే కష్టం తెలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

కనీస చెల్లింపులు

కొంతమంది క్రెడిట్ కార్డులో కనీస చెల్లింపు చేస్తే సరిపోతుందని అనుకుంటారు. ఇది అతి పెద్ద తప్పు. ఎందుకంటే మిగిలిన బ్యాలెన్స్ వడ్డీని పెంచుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.10 వేలు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే అప్పు రూ. 15,000  అవుతుంది.

అప్పు మీద అప్పు

ఇప్పటికే 4 లేదా 5 అప్పులు ఉన్నవారు క్రెడిట్ కార్డు తీసుకోవాలా? వద్దా? అని జాగ్రత్తగా ఆలోచించాలి. మీ జీతం మీద మాత్రమే ఆధారపడితే అప్పులు పెరిగినప్పుడు సమస్యగా మారవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి