AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Employees Strike: రెండు రోజుల ఉద్యోగుల సమ్మెతో 4 రోజులు బ్యాంకులు బంద్‌!

Bank Employees Strike: సామాన్య ప్రజలతో పాటు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయడం వల్ల దేశం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడటం ఖాయం. దీని కారణంగా ప్రభుత్వంతో పాటు సామాన్యుల పని కూడా ప్రభావితమవుతుంది. బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె దేశంలో..

Bank Employees Strike: రెండు రోజుల ఉద్యోగుల సమ్మెతో 4 రోజులు బ్యాంకులు బంద్‌!
Subhash Goud
|

Updated on: Mar 17, 2025 | 7:42 PM

Share

బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్‌ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అయితే ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌-యూఎఫ్​బీయూ తెలిపింది. ఉద్యోగుల సంస్థ కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో జరిగిన చర్చల్లో ఎటువంటి సానుకూల ఫలితం రాలేదని యుఎఫ్‌బియు తెలిపింది.

ఐదు రోజుల పనిదినాలు..

ఐబీఏతో జరిగిన సమావేశంలో UFBU సభ్యులు అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో ఐదు రోజుల పని విధానంతో సహా అనేక అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, అవి పరిష్కారం కావడం లేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ అన్నారు. తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమగ్ర సంస్థ అయిన UFBU గతంలో ఈ డిమాండ్లపై సమ్మెకు పిలుపునిచ్చింది.

ఏ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు?

  1. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీ పోస్టుల భర్తీ: ఉద్యోగులు, అధికారుల పోస్టులకు వెంటనే నియామకాలు చేపట్టాలి.
  2. పనితీరు సమీక్ష, ప్రోత్సాహక పథకాలను ఉపసంహరించుకోండి: ఆర్థిక సేవల విభాగం (DFS) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని యూనియన్లు చెబుతున్నాయి.
  3. బ్యాంకుల పనితీరులో: ప్రభుత్వ బ్యాంకు బోర్డుల స్వయంప్రతిపత్తి ప్రభావితమవుతోందని UFBU ఆరోపించింది.
  4. గ్రాట్యుటీ చట్టంలో సవరణ: పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో సమానంగా చేయాలి. ఆదాయపు పన్ను నుండి మినహాయించాలి. IBAకి సంబంధించిన మిగిలిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.

బ్యాంకులు వరుసగా 4 రోజులు బంద్:

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 9 బ్యాంకులు మార్చి 24, 25 తేదీలలో సమ్మెలో పాల్గొంటాయి. మార్చి 22వ తేదీ నాల్గవ శనివారం, మార్చి 23వ తేదీ ఆదివారం కాబట్టి బ్యాంకులు వరుసగా 4 రోజులు మూసి ఉంటాయి. మీరు ఏదైనా బ్యాంకు సంబంధిత పని చేయాల్సి వస్తే మార్చి 22 లోపు దాన్ని పూర్తి చేయాలి.

సామాన్య ప్రజలతో పాటు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయడం వల్ల దేశం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడటం ఖాయం. దీని కారణంగా ప్రభుత్వంతో పాటు సామాన్యుల పని కూడా ప్రభావితమవుతుంది. బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె దేశంలో వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రతిరోజూ వ్యాపారులు, సేవా ప్రదాతలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాలు బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి బ్యాంకింగ్ కార్యకలాపాలపై చెడు ప్రభావం చూపుతుంది.

బ్యాంకులు మూసివేయడం వల్ల NEFT ద్వారా లావాదేవీలు నిలిచిపోతాయి. దీని కారణంగా భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ సమ్మె కారణంగా చెక్కుల క్లియరెన్స్, ఏటీఎం పనితీరుతో సహా అనేక ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి