RBI: రూ.10,20 నాణేలు తీసుకోకుంటే మూడేళ్ల జైలు శిక్ష.. ఆర్బీఐ హెచ్చరిక!

|

Nov 19, 2024 | 4:50 PM

RBI: భారతదేశంలో రూ.10 నాణెం విడుదలైన రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ చాలా మంది ప్రజలు చట్టబద్ధమైన కరెన్సీగా స్వీకరించేందుకు సంకోచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో రూ.10 నాణెం తీసుకోని వారు మూడు..

RBI: రూ.10,20 నాణేలు తీసుకోకుంటే మూడేళ్ల జైలు శిక్ష.. ఆర్బీఐ హెచ్చరిక!
Follow us on

చాలా మంది దుకాణదారులు 10,20 రూపాయల నాణేలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, చెల్లవంటూ దుకాణాదారులతో పాటు ఇతరులకు కూడా తీసుకోవడం లేదు. ఈ నాణేలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులు పదేపదే చెబుతున్నప్పటికీ చాలా మంది వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా మరోజారీ ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. ఈ నాణేలు తీసుకోకపోతే చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? మీరు అలాంటి వ్యక్తులపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఎవరైనా నాణేలను స్వీకరించడానికి నిరాకరిస్తే (నాణెం చెలామణిలో ఉంటే) అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. అతనిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, దుకాణదారుడు లేదా నాణేలను స్వీకరించడానికి నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Jio Vs BSNL: దాదాపు ఒకే ధరతో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌.. ఈ రెండింటి బెనిఫిట్స్‌ ఏంటి?

ఇవి కూడా చదవండి

భారతదేశంలో రూ.10 నాణెం విడుదలైన రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ చాలా మంది ప్రజలు చట్టబద్ధమైన కరెన్సీగా స్వీకరించేందుకు సంకోచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో రూ.10 నాణెం తీసుకోని వారు మూడు సంవత్సరాల జైలుకు గురవుతారు అని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బ్యాంకులు కూడా ప్రజల్లో, వ్యాపారాల్లో రూ.10 కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో హోటల్స్, క్యాంటీన్లు రూ.10 నాణెం తీసుకోవడం ప్రారంభిస్తున్నాయి. అయినా చాలా మంది తీసుకోవడం లేదు.

మూడేళ్ల జైలు శిక్ష:

ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది. తిరస్కరించడమే కాకుండా అవి చెల్లవంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేసినా శిక్ష ఖాయమని హెచ్చరిస్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలామణీలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Fact Check: ఎంఎస్ ధోని పేరిట రూ.7 నాణెం విడుదల అవుతుందా? ఇందులో నిజమెంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి