LIC Policy Claim: ప్రస్తుతం ఎల్‌ఐసీ పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని వారు కరోనా మహమ్మారి తర్వాత పాలసీల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో పాలసీదారుడు మృతి చెందినట్లయితే ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..? నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా..? లేక కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకోవచ్చా..? అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తుతుంటాయి. అయితే ఎలాంటి టెన్షన్ పడనక్కలేదంటున్నారు నిపుణులు. డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రాసెస్ కూడా ఉంది. ఎల్‌ఐసీ పాలసీదారుడు చనిపోతే ఆ పాలసీదారుడు ఎవరి పేరు అయితే నామినీగా ఇస్తారో వాళ్లు మాత్రమే ఆ ఎల్‌ఐసీ డబ్బులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ క్లెయిమ్‌ను పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఎల్‌ఐసీ కల్పించింది. ముందు ఎల్‌ఐసీ పాలసీ కట్టిన హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దాని కంటే ముందు.. పాలసీ తీసుకున్న పాలసీదారు ఏజెంట్ లేదా ఆ ఏరియా డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో సంతకం తీసుకుని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
ముందు ఎల్‌ఐసీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి..
ముందు ఎల్‌ఐసీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని బ్రాంచ్ మేనేజ్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు బ్రాంచ్ అధికారులు ఫామ్ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌లను ఇస్తారు. ఆఫామ్‌లు నింపిన తర్వాత వాటితో పాటు పాలసీదారుడి ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు జిరాక్స్, అలాగే చనిపోయిన పాలసీదారుడి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని.. అన్నింటి మీద నామినీ సంతకం పెట్టించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ అధికారులు ఇచ్చిన ఫామ్‌లతో పాటు వీటిని కూడా కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒక ఇంటిమేషన్ లెటర్‌ను నామినీ సమర్పించాల్సి ఉంటుంది. అందులో పాలసీదారుడు చనిపోయిన తేదీ, చనిపోయిన ప్రాంతం, చనిపోయిన కారణం లాంటి వివరాలతో ఆ లెటర్ ఉండాలి. అలాగే ఆఫీసు అధికారులు ఇచ్చిన నెఫ్ట్ ఫామ్‌లో నామినీ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి.. అదే బ్యాంకుకు సంబంధించిన క్యాన్సిల్ చెక్, బ్యాంక్ పాస్ బుక్‌ను సమర్పించాలి. బ్యాంక్ పాస్‌బుక్‌లో కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కనిపించేలా ఉండాలి.
ఒరిజినల్ ఐడి కార్డులు తప్పనిసరి
ఎల్‌ఐసీ కార్యాలయంలో డాక్యుమెంట్లను సమర్పించే సమయంలో నామినీ, పాలసీదారుడికి సంబంధించిన ఒరిజినల్ ఐడి కార్డులను వెంట తెచ్చుకోవాలి. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ కార్డులను అధికారులు చెక్ చేస్తారు. బ్యాంక్ ఒరిజినల్ పాస్ బుక్‌ను కూడా అధికారులు చెక్ చేశాక.. అప్పుడు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు. నామినీ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత అధికారులు ఇచ్చే రిసిప్ట్‌ను తీసుకోవాలి. భవిష్యత్తులో డెత్ క్లెయిమ్‌కు సంబంధించి అదే ప్రూప్‌గా ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదవశాత్తు పాలసీదారుడు చనిపోయినట్లయితే ఇలాంటి ప్రాసెస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలంటే ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శిస్తే అక్కడి సిబ్బంది పూర్తి వివరాలు తెలియజేస్తారు.
ఇవి కూడా చదవండి: