EPFO సభ్యులు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెలా ఎంత పెన్షన్ వస్తుంది.. ఫార్ములా ఇదే..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీని మే 3 వరకూ పొడిగించింది.

EPFO సభ్యులు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెలా ఎంత పెన్షన్ వస్తుంది.. ఫార్ములా ఇదే..
RD Scheme

Edited By: Janardhan Veluru

Updated on: Mar 01, 2023 | 11:50 AM

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీని మే 3 వరకూ పొడిగించింది. అంటే ఇంకో రెండు నెలల వరకూ రిటైర్డ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే చాన్స్ కల్పించింది. ఈ కారణంగా, మీరు హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికి ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు, హయ్యర్ పెన్షన్ ఎంపిక చేసుకుంటే, మీ జీతం నుండి ప్రతి నెల ఎంత డబ్బు కట్ అవుతుంది. అనే విషయంపై ఇప్పటికే ఉద్యోగుల్లో పలు చర్చలు ప్రారంభం అయ్యాయి. హయ్యర్ పెన్షన్ స్కీం ఎంచుకుంటే కొత్త లెక్క ఎలా ఉంటుంది , మీరు ఎంత పెన్షన్ పొందబోతున్నారు. వంటి ప్రశ్నలకు సమాధానాలు వివరంగా తెలుసుకుందాం.

హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకునే ముందు, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కోసం మీ జీతం నుండి ప్రస్తుతం ఎంత డబ్బు కట్ అవుతుందో తెలుసుకోవాలి. ప్రస్తుతం EPF ఖాతాకు ఉద్యోగి తరపు కాంట్రిబ్యూషన్ లో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ నుండి 12% కట్ అవుతుంది. అటు ఎంప్లాయర్ తరపునుంచి సైతం 12% జమ అవుతుంది. ఇందులో 8.33% EPSకి , 3.67% ఉద్యోగి EPF ఖాతాకు వెళ్తుంది.

కొత్త పెన్షన్ ఆప్షన్‌లో ఎంత డబ్బు కట్ అవుతుంది:

ఇవి కూడా చదవండి

మీరు EPFO కింద హయ్యర్ పెన్షన్‌ను ఎంచుకుంటే, మీ బేసిక్ పేలో 8.33% EPSకి వెళ్లవచ్చు. అయితే, మీరు హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకుంటే, EPFO మీ PF ఖాతా నుండి EPS మొత్తాన్ని తీసివేస్తుంది. ఇది మీరు ఉద్యోగంలో చేరిన తేదీ లేదా నవంబర్ 1, 1995 రెండింట్లో దేన్ని అయినా ఆధారంగా తీసుకుంటారు.

పింఛను మొత్తం ఎంత అందుతుంది?:

EPS పెన్షన్‌ను లెక్కించడానికి ఫార్ములా ఇదే : పెన్షనబుల్ జీతం X పెన్షనబుల్ సర్వీస్ / 70. ఈ విధంగా, మీరు 25 సంవత్సరాలుగా ఉద్యోగంలో జాయిన్ అయి , 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేశారని అనుకుందాం, కాబట్టి మీరు 33 సంవత్సరాలు పని చేస్తారు. మీ జీతం రూ. 40,000 అయితే, దీని ఆధారంగా మీ పెన్షన్ ఇలా ఉంటుంది:

సాధారణ పెన్షన్ పథకం:

సాధారణ పెన్షన్ పథకం కింద, ఈ పరిస్థితిలో మీరు ప్రతి నెలా పెన్షన్‌గా రూ. 7071 [(రూ. 15000×33)/70] పొందుతారు.

హయ్యర్ పెన్షన్ ఎంచుకుంటే:

రు హయ్యర్ పెన్షన్‌ను ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా పెన్షన్‌గా రూ. 18,857 [(రూ. 40000×33)/70] పొందుతారు. జీతం పెరుగుదలతో దాని మొత్తం కూడా పెరుగుతుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..