
ఇటీవల ఆధార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పదేళ్ల క్రితం ఆధార్ కార్డును పొందిన వినియోగదారులు వాటిని ఎప్పుడూ అప్‌డేట్ చేయకపోతే జూన్ 14 తర్వాత ఆధార్ కార్డ్ పనిచేయదని పేర్కొంటూ ఒక నకిలీ వార్త వైరల్ అవుతుంది. నివేదికల ప్రకారం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ వాదనలను ఖండించింది. అయితే ఇది జరగదని పది సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డులు అప్‌డేట్ కాకపోయినా అవి పని చేస్తూనే ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది. కొంతకాలం క్రితం వచ్చిన ఒక వార్త కారణంగా ఆధార్ కార్డుకు సంబంధించి ఈ మోసపూరిత నివేదికలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వార్త గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కేంద్రం గడువును జూన్ 14, 2024 వరకు పొడిగించామని యూఐడీఏఐ పేర్కొంది. అంతకుముందు ఈ గడువు మార్చి 14 అయితే యూఐడీఏఐ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని జూన్ 14 వరకు పొడిగించింది. ఇది ఆధార్ కార్డ్‌లు రద్దు అవుతుందనే పుకార్లకు దారితీసింది. జూన్ 14 తర్వాత చెల్లదంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రజలు తమ ఆధార్ నంబర్లను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకుంటేనే ఉచిత అప్‌డేషన్ సౌకర్యం లభిస్తుంది. అయితే, వారు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవడానికి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆధార్ కార్డ్‌లో ఎవరి ఫోన్ నంబర్‌ను జోడించకపోతే, వారు దాని కోసం సేవా కేంద్రానికి వెళ్లాలి. రెండో సందర్భంలో, వారు నవీకరణ కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి