Fixed Deposits : ఈ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు..

|

Jul 17, 2021 | 5:23 PM

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఐడీబీఐ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. కొంత మెచ్యూరిటీ కాలానికి సంబంధించి

Fixed Deposits : ఈ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు..
Rupee
Follow us on

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఐడీబీఐ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. కొంత మెచ్యూరిటీ కాలానికి సంబంధించి ఈ మార్పు జరిగింది. ఈ కొత్త నిబంధనలు జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కొన్ని మార్పులతో ఐడిబిఐ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇప్పుడు ఈ బ్యాంకు ఎఫ్‌డిపై వడ్డీ రేటు 2.7 శాతం నుంచి 4.8 కి చేరుతోంది. 7 రోజుల నుంచి 20 సంవత్సరాల ఎఫ్‌డిలపై 2.7 నుంచి 4.8% చొప్పున వడ్డీ ఇస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రకారం.. ఒక కస్టమర్ 7 -14 రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బు జమ చేస్తే అతనికి 2.7% చొప్పున వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 31-45 రోజుల ఎఫ్‌డిలో ఈ బ్యాంక్ 2.8% వడ్డీని ఇస్తోంది. 46-90 రోజుల మధ్య పరిపక్వం చెందే ఎఫ్‌డికి 3% చొప్పున వడ్డీ లభిస్తుంది. 91 రోజుల నుంచి 6 నెలల వరకు ఉండే ఎఫ్‌డిలకు ఇప్పుడు 3.5% వడ్డీ లభిస్తుంది.

కొత్త వడ్డీ రేటు ఎంత?
6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు స్థిర డిపాజిట్లు చేసిన వారికి ఐడిబిఐ బ్యాంక్ డిపాజిట్ మొత్తంపై 4.3% చొప్పున వడ్డీని ఇస్తోంది. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య పరిపక్వత కలిగిన ఎఫ్‌డికి 5.1% వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 5-10 ఎఫ్‌డిపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 10-20 సంవత్సరాల ఎఫ్‌డిలలో పెట్టుబడులు పెట్టిన వారికి 4.8% చొప్పున వడ్డీ లభిస్తుందని ఐడిబిఐ బ్యాంక్ తెలిపింది. ఇది వడ్డీ అత్యధిక పరిమితి. అదనంగా సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డిలపై ప్రత్యేక 50 బేసిస్ పాయింట్ బెనిఫిట్ ఇస్తున్నట్లు ఐడిబిఐ బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు, ఐడిబిఐ బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు వడ్డీని అందిస్తోంది.

అగ్ర బ్యాంకులు చెల్లించే వడ్డీ
దేశంలోని టాప్ 10 బ్యాంకుల గురించి మాట్లాడితే.. స్టేట్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్‌డిపై 2 కోట్ల వరకు సామాన్య ప్రజలకు 2.90-5.40 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 3.40-6.20 శాతం. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ ఎఫ్‌డిపై 2.50-5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3-6.30 శాతం వడ్డీని ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మూడవ స్థానంలో ఉంది ఇది సాధారణ ప్రజలకు 2.50-5.50 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.00-6.25 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3.00-5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50-5.75 శాతం వడ్డీని ఇస్తోంది.

కెనరా బ్యాంక్ సాధారణ ప్రజలకు 2.95-5.50 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.95-6.00 శాతం వడ్డీని ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ ఎఫ్‌డిపై 2.80-5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.30-6.25 శాతం వడ్డీని ఇస్తోంది. ఐడిఎఫ్‌సి బ్యాంక్ జనరల్ ఎఫ్‌డి ఖాతాపై 2.75-5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25-6.25 శాతం వడ్డీ ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 3.25-5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75-5.80 శాతం వడ్డీని ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 3.00-5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50-6.10 శాతం వడ్డీని ఇస్తోంది.

CLAT EXAM -2021 : జూలై 23న క్లాట్ పరీక్ష అడ్మిట్ కార్డులు జారీ.. పరీక్ష మార్గదర్శకాలు విడుదల..

Litchi Fruit Benefits: బరువు ఈజీగా తగ్గాలనుకుంటున్నారా.. ఐతే ఈ పండ్లను తింటే సరి

రిలీజ్ డేట్ కోసం పోటీ పడుతున్న నాని -నాగచైతన్య .. ఒకే రోజు రెండు సినిమాలు..?