ICICI Lombard: ఐసిఐసిఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్.. పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా రెండు క్లెయిమ్‌ చేయవచ్చు..

|

Mar 24, 2022 | 6:45 AM

ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ(ICICI Lombard) ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌( Airtel Payments Ban)తో కలిసి స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్( smartphone insurance)ను ప్రారంభించింది...

ICICI Lombard: ఐసిఐసిఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్.. పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా రెండు క్లెయిమ్‌ చేయవచ్చు..
Follow us on

ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ(ICICI Lombard) ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌( Airtel Payments Ban)తో కలిసి స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్( smartphone insurance)ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో స్మార్ట్‌ఫోన్ బీమాను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు వేగవంతమైన, పేపర్‌లెస్ మరియు సురక్షితమైన డిజిటల్ ప్రక్రియలో బీమాను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ స్వీకరణ పెరగడంతో, స్మార్ట్ పరికరాలకు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ చాలా రెట్లు పెరిగింది. వినియోగదారులు ఇప్పుడు వేగవంతమైన, పేపర్‌లెస్, సురక్షితమైన డిజిటల్ ప్రక్రియ ద్వారా బీమాను కొనుగోలు చేయవచ్చని ICICI లాంబార్డ్ ప్రకటన విడుదల చేసింది.

ICICI లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ప్రమాదాలు లేదా లిక్విడ్ స్పిల్స్ వల్ల ఫోన్, దాని స్క్రీన్‌కు నష్టం వాటిల్లకుండా ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్‌లో భాగంగా, కస్టమర్‌లు పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా రెండు క్లెయిమ్‌లను ఫైల్ చేయవచ్చు. ఇది ఉచిత పికప్ & డెలివరీ సౌకర్యం కల్పిస్తోంది. రూ.1299తో ప్రారంభమయ్యే నెలవారీ ప్రీమియంతో కస్టమర్‌లు తమ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు ధరకు సమానమైన బీమా మొత్తాన్ని పొందవచ్చు. రూ.10,000 నుంచి రూ.100,000 మధ్య ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన పది రోజుల వరకు కస్టమర్‌లు ఈ బీమాను సొంతంగా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ వివరాలను సమర్పించిన తర్వాత, పరికరం పరిశీలన లేకుండానే బీమా ఆటోమేటిక్‌గా జారీ చేస్తారు.

ప్రస్తుతం భారతదేశంలో 750 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారని ఐసిఐసిఐ లాంబార్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. ఈ సంఖ్య 2026 నాటికి 1 బిలియన్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ బీమా వంటి ఉత్పత్తికి అభివృద్ధి చెందుతున్న అవకాశాన్ని, భారీ సామర్థ్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. కస్టమర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లు ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు అదనపు భద్రతను అందించే రక్షణ ప్రణాళికను అందించడానికి ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు.

Read Also.. Realme GT Neo 3: 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో మార్కెట్లో విడుదలైన రియల్‌మీ జీటీ 3