Cars: ఆ రెండు కార్లకు పోటీగా ఐ 20 నయా వెర్షన్.. ఆకట్టుకుంటున్న నయా ఫీచర్స్
భారతదేశంలో బడ్జెట్ కార్ల కొనుగోళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో వచ్చే కార్ల కొనుగోలుకు సగటు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్టన్నింగ్ ఫీచర్స్‌తో రిలీజ్ చేయడంతో ఆ కారుకు పోటీగా హ్యూందాయ్ కంపెనీ ఐ20 నయా వెర్షన్ లాంచ్ చేసింది. కార్ల మార్కెట్‌లో ఈ రెండు కార్ల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

హ్యుందాయ్ కంపెనీ తన ఐ20 లైనప్‌ను విస్తరిస్తూ కొత్త వేరియంట్ మాగ్నా ఎగ్జిక్యూటివ్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.7.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్నకు సంబంధించిన మాగ్నా వేరియంట్లో ఐవీటీ ట్రాన్స్ మిషన్ ఫీచర్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో రావడంతో వినియోగదారులు ఈ కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతారని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతుననారు. అలాగే ఐ 20 స్పోర్ట్ (ఓ) వేరియంట్‌లో ఉన్న అధునాతన ఫీచర్స్‌తో మాగ్నా ఎగ్జిక్యూటివ్‌ను లాంచ్ చేశారు. పుష్ బటన్ స్టార్ట్ కూడిన స్మార్ట్ కీ, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బోస్ ప్రీమియం సెవెన్-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
హ్యుందాయ్ ఐ20 తాజా అప్‌డేట్స్‌తో భారతదేశంలో అత్యంత సరసమైన సీవీటీ హ్యాచ్ బ్యాక్‌గా మారింది. హ్యుందాయ్ ఐ 20 రెండు ట్రాన్స్ మిషన్ ఎంపికలలో లభిస్తుంది. ఫైవ్ -స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్‌తో ఐవీటీ (ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్)తో వస్తుంది. ఐవీటీ అనేది ప్రాథమికంగా ఒక రకమైన కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్ వల్ల క్లబ్లెస్ డ్యూయల్ పెడల్ టెక్నాలజీ సౌలభ్యాన్ని అనుమతిస్తుంది. హ్యుందాయ్ ఐ20కు సంబంధించిన ఐవీటీ శ్రేణి మాగ్నా ట్రిమ్ ప్రారంభ ధర రూ.8.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
హ్యుందాయ్ ఐ20 మారుతి సుజుకి బాలెనోతో పాటు టాటా ఆల్ట్రోజ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మారుతి సుజుకి బాలెనో ఆటో గేర్ షిఫ్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది. బాలెనో ఏజీఎస్ వెర్షన్ రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. టాటా ఆల్టోజ్ కూడా అప్‌డేటెడ్ ఏఎంటీతో వస్తుంది. ఈ కారు కూడా రూ.8.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.9.65 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




