Hyderabad Home Prices: మార్కెట్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో జూలై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల ధరలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. ఈ ధరలపై స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక విడుదల చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోతోపాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు అకాశన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో కార్యాలయాల విస్తరణ, ఇతర పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ రంగం మరింతగా విస్తరిస్తుండటంతో ధరలు పెరిగిపోతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో నివాస గృహాల ధరలు క్యూ2021లో సంవత్సరానికి 10.6 శాతం వార్షిక సగటుతో పెరిగాయి. ఇది 2005 ప్రారంభం నుంచి వేగవంతమైన ధర వృద్ధి రేటుగా నమోదైంది. 12 నెలల కాలంలో ధరలు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనేక మార్కెట్లలో నివాస విలువ స్థిరంగా ఉంది. ఇప్పుడు పెరుగుతూ స్థిరంగా ఉంటుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశిర్ బైజల్ తెలిపారు. రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) పెట్టుబడులకు రిటైల్ మదుపరులు ఆసక్తి చూపుతున్నందున భారతీయ రియల్ ఎస్టేట్ రీట్స్ మార్కెట్ బాగా విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: