Chicken Price: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధర!

|

Jul 26, 2023 | 4:23 PM

ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. టమాట ధర మాత్రం ఏ మాత్రం దిగి రావడం లేదు. కిలోకు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఇక వాతావరణంలో మార్పులతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల చికెన్‌..

Chicken Price: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధర!
Chicken Prices
Follow us on

ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. టమాట ధర మాత్రం ఏ మాత్రం దిగి రావడం లేదు. ఇక హైదరాబాద్‌లో కిలోకు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఇక వాతావరణంలో మార్పులతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల చికెన్‌ ధరలు సైతం ఆకాశన్నంటాయి. కానీ ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. నెల రోజుల కిందట కిలో చికెన్‌ ధర రూ.280 నుంచి రూ.320 వరకు ఉండగా, తాజాగా భారీగా దిగి వచ్చింది.

తాజాగా స్కిన్‌లెస్‌ కిలో రూ.200 వరకు ఉండగా, లైవ్‌ కోడి ధర 130 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పలుకుతోంది. ఇక స్కిన్‌తో ఉన్న చికెన్‌ ధర 180 రూపాయల నుంచి 190 రూపాయల వరకు ఉంది. పెరుగుతున్న కూరగాయల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి.

ఇక నెల రోజులుగా టమాట ధరలు పరుగులు పెడుతున్నాయి. కిలో టమాట ధర 180 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో దోరగా ఉన్న టమాట ధర రూ150 వరకు ఉంది. ఇక రైతు బజార్లో మాత్రం కిలో రూ.75 వరకు ఉన్నా.. సంతల్లో మాత్రం అధికంగానే విక్రయిస్తున్నారు. అయితే టమాట ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి