Hyderabad: మీరూ స్టార్టప్ పెడుతున్నారా? ఐతే ఈ రూ.100 కోట్ల ఫండింగ్ మీ కోసమే..

దేశవ్యాప్తంగా జనరేటివ్ AI, గేమింగ్, స్పేస్‌టెక్, డ్రోన్‌లు, హెల్త్‌టెక్, కన్స్యూమర్ టెక్, ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ SaaS వంటి రంగాలలో అధిక సంభావ్య స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి హైదరాబాద్ ఏంజెల్ ఫండ్ (haf.vc) గురువారం రూ.100 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్‌ను ప్రకటించింది. ఈ ఫండ్ అభివృద్ధి చెందుతున్న, అధిక వృద్ధి చెందుతున్న రంగాలలో 15-20 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది..

Hyderabad: మీరూ స్టార్టప్ పెడుతున్నారా? ఐతే ఈ రూ.100 కోట్ల ఫండింగ్ మీ కోసమే..
Hyderabad Angel Fund For Startups

Edited By: Srilakshmi C

Updated on: Nov 14, 2025 | 7:59 PM

హైదరాబాద్, నవంబర్ 14: భారత స్టార్టప్ ప్రపంచంలో ప్రారంభ దశ కంపెనీలకు మరింత ఆర్థిక బలం అందించేందుకు హైదరాబాద్ ఏంజెల్స్ నెట్‌వర్క్ (HAN) కీలక ముందడుగు వేసింది. సంస్థ ‘హైదరాబాద్ ఏంజెల్స్ ఫండ్ (HAF)’ పేరుతో కేటగరీ–I AIFను ప్రకటించింది. మొత్తం రూ.100 కోట్ల లక్ష్యంతో ఈ ఫండ్‌ను రూపొందించారు. ఇందులో రూ.50 కోట్ల గ్రీన్‌షూ ఆప్షన్ కూడా భాగమైంది. ఫండ్ ప్రారంభ దశలోనే లక్ష్యానికి 62 శాతం కమిట్‌మెంట్లు సొంతం చేసుకుంది. తొలి సంస్థాగత పెట్టుబడి కోసం జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ దశ స్టార్టప్‌లకు బలమైన పెట్టుబడి వనరును అందించడమే ఈ ఫండ్ ప్రధాన ఉద్దేశం.

HAF ప్రతి స్టార్టప్‌లో సాధారణంగా రూ. 2 నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఫాలో-ఆన్ రౌండ్ల కోసం ప్రత్యేక రిజర్వ్ కూడా ఉంచారు. పెట్టుబడులతో పాటు ఫౌండర్లకు మెంటార్‌షిప్ అందించడం ఈ ఫండ్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రీ-సిరీస్ A నుంచి సిరీస్ B దశలో ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని, వెంచర్ క్యాపిటల్ సంస్థలతో కలిసి కో-ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్లుగా రత్నాకర్ సమవేదం, కళ్యాణ్ శివలెంక వ్యవహరిస్తున్నారు. మాజీ ITC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ ధోబాలే చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫండ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో గ్లింక్, పాఠశాల, ఫ్రీడ్, ఎడ్యూటర్, ఫ్లెక్స్‌మో వంటి స్టార్టప్‌లు ఉన్నాయి. పెట్టుబడికి ముందు ప్రతి స్టార్టప్‌ను మార్కెట్ స్కేలబిలిటీ, ఫౌండర్ అనుభవం, ఇన్నోవేషన్, కస్టమర్ యాక్సెస్, ఎకోసిస్టం బలం, దీర్ఘకాల విలువ సృష్టించే సామర్థ్యంపై విశ్లేషిస్తారు. ఈ స్కోరింగ్ ఆధారంగానే పెట్టుబడి నిర్ణయం తీసుకుంటారు.

భారత స్టార్టప్ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది భారీగా పెరిగాయి. 2025 మొదటి తొమ్మిది నెలల్లోనే $9 బిలియన్ ఫండ్లు ప్రకటించబడ్డాయి. ఇది 2024 ఏడాది మొత్తం $8.7 బిలియన్‌ను మించి ఉంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఒక్కసారిగా $2.5 బిలియన్ పెట్టుబడి 25 ఇన్వెస్టర్ల ద్వారా లభించింది. వీటిలో 17 ఫండ్లు ప్రత్యేకంగా ప్రారంభ దశ స్టార్టప్‌లపై దృష్టిపెట్టాయి. 2025లో ప్రారంభ దశ ఫండ్‌ను ప్రకటించిన సంస్థల్లో Accel India, A91 Partners, Bessemer Venture Partners, 360 ONE Asset వంటి ప్రముఖ VC సంస్థలు ఉన్నాయి. ఈ కొత్త ఫండ్ ద్వారా స్థానికంగా, జాతీయంగా స్టార్టప్‌లకు మరింత బలం అందే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.