Soaps, Detergents Price: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి భారంగా మారుతోంది. ఇక దేశీయ ఎఫ్‌ఎంసీజీ (FMCG) దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (HUL) మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. తయారీ ఖర్చు అధికం అవుతున్న నేపథ్యంలో కొనుగోలుదారుపై భారం వేయకతప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది.
కాగా, గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయా హెచ్‌యూఎల్ ఉత్పత్తుల ధరలు ఐదుసార్లు పెరగడం గమనార్హం. ఇక తాజాగా లక్స్, రెక్సోనా, పాండ్స్ టాల్కమ్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్, లిక్విడ్ ధరలు 3 నుంచి 10 శాతం మేర పెరిగాయి. గత నెలలో వీల్ డిటర్జెంట్, రిన్ బార్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్‌బాయ్, పియర్స్ ధరలను హెచ్‌యూఎల్ 3-20 శాతం మేర పెంచింది. గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్‌లోనూ ఇవే ఉత్పత్తుల ధరలు పెరగగా, తాజాగా మరోసారి పెంచింది. ముందే ద్రవ్యోల్బణం పరుగులు పెడుతున్న సందర్భంలో ఇలా ధరలు పెరుగుతూపోతే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగకతప్పదన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరిలో రిటైల్ ధరల సూచీ 6 శాతాన్ని దాటేసిన సంగతి విదితమే.
ఇవి కూడా చదవండి: