కరోనా కొత్త ఆలోచనలకు తెరలేపుతోంది. వినియోదారుకు బ్యాంక్ కు మధ్య ఎటువంటి ఇబ్బందుకుల రాకుండా కొత్త టెక్నాలజీని ఎస్‌బీఐ వినియోగిస్తోంది. తాజాగా.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను మంజూరు చేసేందుకు వీడియో కేవైసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకేవైసీతో కేవైసీకి అయ్యే ఖర్చును సగానికి సగం తగ్గించడంతోపాటు ఆన్‌లైన్ మోసాలకు ఈ వీడియో కేవైసీతో అడ్డుకోవచ్చని అంటోంది. దరఖస్తుదారుడిని గుర్తించడం, వారిని ద్రువీకరించడం, ఫోటో తీసుకోవడం, జియోట్యాగింగ్ చేయడం వంటి ప్రక్రియ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ నిబంధనలు అమల్లో ఉండటంతో ఈ ఆధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ఎస్‌బీఐ కార్డు ఓ ప్రకనటలో పేర్కొన్నది.