Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. కొత్త యాప్‌లో మొబైల్ నెంబర్, అడ్రస్ అప్డేట్ మరింత ఈజీ.. ఎలానో చూడండి

కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. మీ కుటుంబసభ్యుల వివరాలు అన్నీ ఒకేచోట ఉండటంతో పాటు బయోమెట్రిక్ వివరాలను లాక్, అన్ లాక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలో చూద్దాం.

Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. కొత్త యాప్‌లో మొబైల్ నెంబర్, అడ్రస్ అప్డేట్ మరింత ఈజీ.. ఎలానో చూడండి
Aadhaar App

Updated on: Jan 28, 2026 | 9:46 PM

యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను జనవరి 28వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ పేరుతో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. గతంలోనే ఈ యాప్ తీసుకురాగా.. ఇప్పుడు పూర్తి స్థాయి వెర్షన్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ పూర్తి స్థాయి వెర్షన్‌లో అనేక కొత్త ఫీచర్లు జోడించారు. దీంతో ఆధార్ వినియోగదారలు మరింత సురక్షితంగా, సులభంగా ఆధార్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌కు మరింత భద్రత పెరగనుంది. ఇందులోని ఫీచర్లు ఏంటి..? ఎలా వాడాలి? అనే విషయాన్ని చూద్దాం.

ఎలా వాడాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి
-ఆధార్ అని సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
-మొబైల్ మోనూలోకి వెళ్లి యాప్‌ను క్లిక్ చేయండి
-కెమెరా, ఎస్ఎంఎస్, కాల్స్‌కు అనుమతులు ఇవ్వండి
-ఇక ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేయాలంటే ఫొటోలు, వీడియోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది
-ఇక నోటిఫికేషన్స్ అందుకోవాలంటే నోటిఫికేషన్స్‌ వచ్చేలా అనుమతి ఇవ్వండి
-ఇక కాల్స్, మెస్సేజ్‌లు చేయడానికి కూడా అనుమతి ఇవ్వండి
-ఆ తర్వాత మీ ఆధార్ నెంటర్ ఎంటర్ చేసి కన్ఫామ్‌పై క్లిక్ చేయండి
-ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను ఓకే చేయండి
-ఇక మీ మొబైల్‌లో రెండు నెంబర్లు ఉంటే ఏ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలనే ఆప్షన్ ఎంచుకోండి
-ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్‌కు వెళ్లండి
-ఇక ఫేస్ అథెంటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి
-కళ్లద్దాలు ఉంటే తీసివేసి వెలుతురు చుట్టూ బాగుండేలా చూసుకోండి.
-ఆ తర్వాత పర్సనల్ పిన్‌ను నెంబర్లను ఎంటర్ చేసి పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి

ఫీచర్లు ఇవే..

మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను యాడ్ చేయాలంటే.. టాప్‌లో యాడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను యాడ్ చేయండి. దీంతో మీ ఫ్యామిలీ ఆధార్ కార్డులన్నీ ఒకేచోట ఉంటాయి. దీని వల్ల ఎప్పుడైనా అసవరమైనప్పుడు పని సులువు అవుతుంది. ఇక సెలక్టివ్ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఆధార్‌కు సంబంధించి ఏ వివరాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నారో అవే ఇతరులతో పంచుకోవచ్చు. ఫొటో, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, వయస్సు స్టేటస్, జెండర్, మొబైల్ నెంబర్లలో ఏది కావాలంటే ఆ వివరాలు మాత్రమే పంచుకోవచ్చు. ఇక మస్క్‌డ్ లేదా అన్‌మాస్క్‌డ్ ఆధార్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాన్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఇక సర్వీసెస్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్ నెంబర్, అడ్రస్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.