NSE IFSC: ఇకపై అమెరికన్ కంపెనీల(American Companies) షేర్లలో పెట్టుబడి పెట్టడం సులభం కానుంది. అమెరికన్ మార్కెట్లలోని(US Markets) షేర్లలో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా లాంటి అమెరికన్ దిగ్గజ కంపెనీల షేర్లను ఇక్కడి నుంచే ట్రేడింగ్ చేయవచ్చు. ఇందుకోసం దేశీయ స్టాక్ మార్కెట్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కొత్తగా.. NSE IFSC సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇది గుజరాత్ లో నిర్మించిన గిఫ్ట్ సిటీ నుంచి తన సేవలను అందిస్తోంది. ఈ సేవలు మార్చి 3 నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా కొన్ని ఎంపిక్ చేసిన అమెరికన్ కంపెనీ షేర్లలో భారతీయ మదుపరులు పెట్టుబడులు పెట్టవచ్చు.
ఈ ఇన్వెస్ట్మెంట్ స్పాన్సర్ చేయని డిపాజిటరీ రిసీట్స్ ద్వారా అంటే DRల ద్వారా జరుగుతాయి. ఈ క్రమంలో ముందుగా.. Microsoft, Amazon, Tesla, Nike, Exxon Mobil, Coca-Cola, Apple, Alphabet వంటి 50 అమెరికన్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం మీరు.. NSE ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు. NSE IFSC తెచ్చిన కొత్త అవకాశం ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ ప్రక్రియతో ఇకపై మదుపరులు అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.
పెట్టుబడి పెట్టండి ఇలా..
NSE IFSCలో ట్రేడింగ్ ప్రారంభించడానికి, పెట్టుబడిదారులు NSE IFSC రిజిస్టర్డ్ బ్రోకర్‌తో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాను తెరవవలసి ఉంటుంది. అటువంటి బ్రోకర్లు దేశంలో ఇప్పుడు 36 మంది ఉన్నారు. భారతదేశంలోని చాలా పెద్ద బ్రోకింగ్ హౌస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడిదారులు స్థానిక బ్యాంకు ఖాతా నుంచి బ్రోకర్ ఖాతాకు నిధులను బదిలీ చేయాలి. బ్రోకర్ ఖాతాలో నిధులు ట్రాన్ఫర్ పూర్తయ్యాక.. ఇన్వెస్టర్లు US స్టాక్‌లలో ట్రేడింగ్ చేయవచ్చు.
ఈ స్టాక్‌లలో ట్రేడింగ్ కోసం, రిటైల్ పెట్టుబడిదారులు IFSC ప్లాట్‌ఫారమ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితుల క్రింద లావాదేవీలు చేయవచ్చు. ఇది ప్రస్తుతం ప్రతి ఆర్థిక సంవత్సరానికి 2.5 లక్షల డాలర్ల వరకు అనుమతించబడుతుంది.
ఇవీ చదవండి..
UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు