Post Office: పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం

|

Oct 07, 2024 | 10:31 AM

పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం వినియోగదారులకు రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్టాఫీసు సేవలను మరింత మెరుగు పర్చింది. సామాన్య ప్రజల కోసం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. ఇక మహిళల కోసం..

Post Office: పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం
Follow us on

పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం వినియోగదారులకు రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్టాఫీసు సేవలను మరింత మెరుగు పర్చింది. సామాన్య ప్రజల కోసం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. ఇక మహిళల కోసం, సీనియర్ సిటజన్స్ కోసం, పిల్లల కోసం అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో పోస్టాఫీస్ బిజినెస్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ వ్యాపారంతో మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఫ్రాంచైజీ బిజినెస్‌:

పోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం సమకూర్చుకోవచ్చు. కొత్తగా బిజినెస్‌ మొదలు పెట్టేవారికి మంచి అవకాశమనే చెప్పాలి. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ ఓపెన్‌ చేసేందుకు రూ.5వేలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే సరిపోతుంది. ఈ పోస్టాఫీసు ఫ్రాంచైజీని ఓపెన్ చేసి సేవలపై కమీషన్ల ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. పోస్టాఫీసుల్లో రెండు రకాల ఫ్రాంచైజీలను ఆఫర్‌ చేస్తోంది. ఒకటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, రెండోది పోస్టల్ ఏజెంట్లు. ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను కౌంటర్ సర్వీసులు అందించేందుకు ప్రారంభించవచ్చు. అలాగే పోస్టల్ ఏజెంట్స్ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ వస్తువులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ఫ్రాంచైజీలకు అర్హతలు:

పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలనుకునే వారు 18 ఏళ్లు నిండి ఉండాలి. పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఫ్రాంచైజీని ఓపెన్ చేసేందుకు భారత పౌరులై ఉండాలి. పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అనర్హులు.

ఎంత ఆదాయం వస్తుంది?

ఈ ఫ్రాంచైజీల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. పోస్టల్‌ సర్వీసులపై కమీషన్‌ ఉంటుంది. దీని ద్వారా మంచి లాభం ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.3, స్పీడ్ పోస్ట్ బుకింగ్ పై రూ.5, రూ.100 నుంచి రూ. 200 మధ్య ఉండే మనీయార్డర్లకు రూ. 3.50 కమీషన్, అలాగే రూ.200 ఆపైన ఉండే వాటికి రూ.5 కమీషన్ పొందవచ్చు. అంతేకాదు.. నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ పొందవచ్చు. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5 శాతం కమీషన్ పొందవచ్చు. ఈ ఫ్రాంచైజీల ద్వారా నెలకు కనీసం రూ.80 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫ్రాంచైజీలు ప్రారంభించాలనుకునేవారు సమీపంలో ఉన్న పోస్టాఫీసును సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి